తమిళనాడు, కేరళలో పిల్లలకు కర్రసాము ఎక్కువగా నేర్పిస్తున్నారు.. ఎందుకో తెలుసా?

తమిళనాడు, కేరళలో పిల్లలకు కర్రసాము ఎక్కువగా నేర్పిస్తున్నారు.. ఎందుకో తెలుసా?

భారత దేశపు పురాతన యుద్ధ కళ కర్రసాము..కొంత కాలం కనుమరుగైన ఈ కళకు ఇప్పుడు ప్రాధాన్యత పెరుగుతోంది. కర్రసాము కళను ఎక్కువగా అమ్మాయిలు నేర్చు కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలను చూసి తల్లిదండ్రులు ఈ కళను తమ పిల్లలకు నేర్పించేందుకు సిద్ధపడు తు న్నారు. అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా కర్రసామును నేర్చుకుంటున్నారు. ఈకళతో శారీరక, మానసిక బలాన్నిపెంచుకోవచ్చంటున్నారు. ఇది మొత్తం శారీరక పని తీరును మెగురుపరుస్తుందన్నారు నిపుణులు. 

చైనా, థాయిలాండ్, జపాన్, కొరియా, ఇండోనేషియా వంటి అనేక దేశాల్లో మార్షల్ ఆర్ట్స్ కు  మంచి గుర్తింపు ఉంది. ఈ దేశాలు వారి యుద్ధ కళల్లో వారి సంస్కృతి కనిపిస్తుంది. భారత దేశంలోనూ అనేక ప్రాచీన యుద్ధ కళలు ఉన్నాయి. కేరళ లో కలరిపయట్టు, తమిళనాడు నుంచి సిలంబం వంటి అనేక పురాతన యుద్ధ కళలు నేర్చుకునేవారి తప్పా చాలామందికి తెలియదు. 

తమళనాడులో ఇప్పుడు సిలంబం యుద్ద కళను తమ పిల్లలకు నేర్పించేందుకు తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిలంబం క్రీడా శిక్షణ తరగతులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంతరించి పోతున్న సాంప్రదాయ క్రీడలకు మద్దతు నివ్వడం , ప్రోత్సహించడం తో ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు ఈ కళ ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. సిలంబం అనేది కర్రతో చేసే యుద్ధ కళ. ఆత్మరక్షణ కోసం మాత్రమే కాకుండా గుండె ఆరోగ్యానికి, కండరాల బలాన్ని పెంచడానికి కూడా ఇది గొప్ప క్రీడ. సిలంబం యుద్ధ కళను 60 యేళ్ల వృద్ధులు కూడా ఈజీగా  నేర్చుకోవచ్చు. 

కర్రసాము తో శారీరక , మానసిక ప్రయోజనాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా మార్గాలను తెరుస్తుంది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లలను తదనుగుణంగా తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రత్యేకించి బాలికలకు  సిలంబం నేర్చుకోవడం వల్ల స్వీయరక్షణ  మార్గం దొరుకుతుందని భావిస్తున్నారు. సిలంబం తో క్రమశిక్షణతోపాటు సాంప్రదాయ కళలను తదుపరి తరానికి అందించడం ద్వారా వాటిని రక్షించే ప్రాముఖ్యతను నొక్కి చెపుతున్నారు.