కంగనాకు నోటీసులు ఎందుకివ్వలే.?..ఎన్సీబీపై నగ్మా ఫైర్

కంగనాకు నోటీసులు ఎందుకివ్వలే.?..ఎన్సీబీపై నగ్మా ఫైర్

బాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. వాట్సప్ చాట్ ఆధారంగా  డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలతో కొంత మందికి నోటీసులిచ్చినప్పుడు..  తాను డగ్స్ కు అడిక్ట్ అయ్యానని  స్వయంగా చెప్పిన కంగనాకు నోటీసులెందుకివ్వడం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత నగ్మా. సెలబ్రిటీల ఇన్ఫర్మేషన్ ను మీడియాకు లీక్ చేసి వారి పేరు ప్రఖ్యాతలను నాశనం చేయడమే ఎన్సీబీ విధా? అని  ప్రశ్నించారు.

అంతేగాకుండా దియామిర్జా,అనురాగ్ కశ్యప్,దీపికా పదుకొనే వీళ్లంతా ఒకప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారని అందుకే ఇపుడు వేధిస్తున్నారని ఉన్న ఫోటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది నగ్మా.

ఇప్పటికే ఈ కేసులో  శ్రద్ధాకపూర్, దీపికాపదుకొనే,సారా అలీఖాన్, రకూల్ ప్రీత్ సింగ్ కు ఎన్సీబీ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఎన్సీబీ విచారణకు రకూల్ ప్రీత్ సింగ్  హాజరు కావాల్సింది. కానీ తనకు నోటీసులందలేదంటూ ఆమె విచారణకు హాజరు కాలేదు. రకూల్ కు నోటీసులిచ్చామని రకూల్ స్పందించడం లేదంటున్నారు ఎన్సీబీ అధికారులు.

దేశంలో 57 లక్షలు దాటిన కరోనా కేసులు