అమెరికాలో మోటెల్ వ్యాపారం చేస్తున్న గుజరాతీలనే ఎందుకు చంపుతున్నారు.. ? 8 నెలల్లో 8 మంది హత్య

 అమెరికాలో మోటెల్ వ్యాపారం చేస్తున్న గుజరాతీలనే ఎందుకు చంపుతున్నారు.. ? 8 నెలల్లో 8 మంది హత్య

అమెరికాలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా దేశంలో మోటెల్ బిజినెస్ లో ఉన్న గుజరాతీలను టార్గెట్ చేస్తున్నారు అక్కడి వారు. 2025.. ఈ తొమ్మిది నెలల్లోనే ఏడుగురు గుజరాతీలు హత్యకు గురయ్యారు. హత్య వెనక కారణంపైనా ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. అమెరికా దేశం మొత్తంలో ఉన్న ఒక్క శాతం గుజరాతీలే.. 60 శాతం మోటెల్ బిజినెస్ నడుపుతున్నారు.. ఈ కారణంగానే గుజరాతీలు టార్గెట్ అయ్యారా.. అందుకే వాళ్లను చంపుతున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అమెరికాలో, ముఖ్యంగా పటేల్ గుజరాతీ సమాజం మోటల్స్, గ్యాస్ స్టేషన్లు,  కన్వీనియన్స్ స్టోర్స్ వంటి వ్యాపారాలు నిర్వహించడంలో చాలా ప్రసిద్ధి చెందింది. వీరు దేశంలోని 60% కంటే ఎక్కువ మోటళ్లను నడిపిస్తున్నారు. 1960ల నుండి గుజరాతీ కుటుంబాలు సంపాదనను మళ్లీ పెట్టుబడి పెట్టడం, కుటుంబ సభ్యులతో వ్యాపారాలు చేయడం, ఖర్చులను తగ్గించడం వంటి వ్యూహాలతో ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాయి. కంజి మంచు దేశాయ్ వంటి తొలి పటేల్ పారిశ్రామికవేత్తల మార్గదర్శకత్వం, అలాగే ఆసియన్ అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ (AAHOA) వంటి సంస్థల సహకారం ఈ విజయానికి దోహదపడ్డాయి.

దాడులు, భద్రతా సమస్యలు: అయితే కొంతకాలం నుండి గుజరాతీయులపై నేరాలు పెరుగుతున్న్నాయి. ఈ ఏడాదిలో మాత్రమే, అమెరికాలో మోటల్స్ నిర్వహిస్తున్న ఏడుగురు గుజరాతీలు హత్యకు గురయ్యారు. అంతేకాదు నిన్న సోమవారం పెన్సిల్వేనియాలో రాకేష్ పటేల్, అక్టోబర్ 5న నార్త్ కరోలినాలో అనిల్ పటేల్ సహా పంకజ్ పటేల్ కాల్చి చంపబడ్డారు.

ఈ వ్యాపారాలు ముఖ్యంగా హైవేల వెంట లేదా మారుమూల ప్రాంతాల్లో ఉన్న మోటళ్లు కావడంతో ఎక్కువగా దొంగతనాలు, మాదకద్రవ్యాల అమ్మకాలు, వ్యభిచారం వంటి నేరాలకు కేంద్రాలుగా మారుతున్నాయని వార్తలు చెబుతున్నాయి. గుజరాతీలు ఎక్కువగా భద్రత లోపించడం అంటే సిసి కెమెరాలు, నైట్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు.

పెరుగుతున్న జాత్యహంకారం: దీని వెనుక జాత్యహంకారం, భారత వ్యతిరేక భావనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాలలో  వలసదారులపై పెరుగుతున్న ఆగ్రహం, రాజకీయ నాయకులు వలస వ్యతిరేక ప్రచారాలు చేయడం వంటివి ఈ దాడులకు మరింత ఊతం ఇస్తున్నాయి. గుజరాతీ వ్యాపారాల దృష్టి గోచరత (visibility), వాటి ఏకాగ్రత (concentration) కూడా వారిని సులభంగా లక్ష్యంగా మారుస్తున్నాయి. వ్యాపారంలో విజయం సాధించినప్పటికీ మోటల్స్, గ్యాస్ స్టేషన్లలో గుజరాతీల మరణాలు, ఈ వ్యాపారంలో ఉన్న ప్రమాదాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.