సన్ స్క్రీన్ ఎందుకు?

సన్ స్క్రీన్ ఎందుకు?

సన్ రేస్ (అంటే యూవీ రేడియేషన్) నుంచి మన చర్మాన్ని కాపాడే బ్లాకింగ్ ఏజెంట్ ‘సన్ స్క్రీన్’. ఎండకు చర్మం మండిపోవడం, నల్ల మచ్చలు రావడం, స్కిన్ క్యాన్సర్ వంటి సమస్యల నుంచి సన్ స్క్రీన్ మనల్ని కాపాడుతుంది. ఇందులో ఫిజికల్ బ్లాకర్స్, కెమికల్ బ్లాకర్స్ అని రెండు రకాలు ఉంటాయి. క్రికెట్ ఆడేటప్పుడు వాళ్లు తమ చర్మానికి రాసుకునే వైట్ క్రీమ్స్.. ఫిజికల్ బ్లాకర్స్. కెమికల్ బ్లాకర్స్‌‌‌‌లో ఎవోబెంజోన్, ఆక్సీబెంజోన్ కెమికల్స్ ఉంటాయి. ఇవి రేడియేషన్‌‌ని పీల్చేసుకుంటాయి.

సన్ స్క్రీన్ కొనేముందు… ఎస్పీఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్) 30 నుంచి 50 శాతం మధ్యలోవి వాడితే 97 శాతం స్కిన్‌‌‌‌ కవర్ అవుతుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ తీసుకుంటే – యూవీ-ఎ, యూవీ-బీ రేస్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్ మంచిది. జెల్, స్ప్రే, లోషన్స్, క్రీమ్స్.. ఇలా రకరకాలుగా సన్ స్క్రీన్స్‌‌ దొరుకుతాయి. మన ఇండియన్స్‌‌కు మామూలుగానే మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ. ఇది క్యాన్సర్ రేట్‌ని తగ్గిస్తుంది. అయినప్పటికీ స్కిన్ కేర్ కోసం సన్ స్క్రీన్ వాడాల్సిందే. సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల విటమిన్ -డి కొంతవరకు తగ్గుతుంది. అయితే దాని కోసం విటమిన్ – డి పుష్కలంగా దొరికే డైట్ ఫాలో అవ్వాలి. అంతేగానీ, సన్ స్క్రీన్ రాసుకోవడం మాత్రం మానొద్దు!