కోల్‌కతా పోలీసుల యూనిఫాం తెలుపు రంగులో ఎందుకుంటుందంటే..

కోల్‌కతా పోలీసుల యూనిఫాం తెలుపు రంగులో ఎందుకుంటుందంటే..

చాలా మందికి పోలీస్‌ డిపార్ట్మెంట్ లో చేరాలనే కల ఉంటుంది. కానీ చాలా మందికి అది కలగానే మిగిలిపోయింది. అమితాబ్ బచ్చన్ నుంచి రణవీర్ సింగ్ వరకు పెద్ద నటులు సైతం సినిమాల్లో పోలీస్ పాత్రలో నటించాలని తహతహలాడుతుంటారు. ఈ సందర్భంగా మీరు గమనిస్తే, దాదాపు ప్రతి పెద్ద నటుడు తమ సినిమాల్లో ఒక్కసారైనా పోలీసు యూనిఫాంలో కనిపిస్తూ ఉండడం చూస్తూనే ఉంటాం. అయితే ఈ ఖాకీ యూనిఫామ్‌లో ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా దానిని ధరించడానికి ఉత్సాహం చూపేవారు భారతదేశంలోని రాష్ట్రాల్లో పోలీసు యూనిఫాం ఖాకీ రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా (పోలీసు యూనిఫాం ఖాకీలోనే ఎందుకు)? ఖాకీ శక్తిని చూపించేలా సినిమాల పేర్లు కూడా ఖాకీ పైన వచ్చాయి. కానీ ఖాకీ రంగు ఎక్కడ నుండి వచ్చిందో మాత్రం చాలా మందికి తెలియదు!

ఖాకీ రంగును చూడగానే పోలీసులు అని ఈజీగా గుర్తు పడతాం. కానీ అసలు ఈ రంగునే ఎందుకు ఎంచుకున్నారు. దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి అన్న విషయానికి వస్తే..  బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు పోలీసు డిపార్ట్‌మెంట్ యూనిఫామ్‌ను తెల్లగా ఉండాలని నిర్ణయించుకున్నారు ( కోల్‌కతా పోలీసు యూనిఫాం తెల్లగానే ఉంటుంది). ఇది చూడడానికి చాలా అందంగా కనిపించింది. కానీ తెలుపు రంగులో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే ఇది చాలా త్వరగా మురికి అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మురికి యూనిఫాం ధరించడం క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించబడింది. అందుకే బ్రిటిష్ అధికారులు తమ యూనిఫామ్‌లకు రంగును మార్పు చేయడంపై దృష్టి పెట్టారు.

పోలీసు యూనిఫాం ఖాకీ రంగులోనే ఎందుకు ఉంటుంది?

ఆ సమయంలోనే టీ ఆకుల రంగును పోలీసు యూనిఫాంకు వేయడానికి ఉపయోగించారు. దీని కారణంగా యూనిఫాం రంగు లేత పసుపు నుండి గోధుమ రంగులోకి మారింది. 1847లో ఖాకీ సూట్ ధరించిన సైనికుడిని నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ గవర్నర్ జనరల్ చూసినప్పుడు, అతను పోలీసు యూనిఫామ్‌లకు ఖాకీని రంగుగా ఎంచుకున్నాడు. అప్పటి నుంచి పోలీసుల యూనిఫాం ఖాకీగా మారడం మొదలైంది. ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోని పోలీసులు ఖాకీ ధరిస్తే, కోల్‌కతా పోలీసులు మాత్రం తెల్లటి యూనిఫాం ధరిస్తారు.

కోల్‌కతా పోలీసుల యూనిఫాం ఎందుకు తెల్లగా ఉంటుంది?

బెంగాల్‌లోని కొన్ని జిల్లాల పోలీసుల యూనిఫాం కూడా ఖాకీ రంగులోనే ఉంటుంది. కానీ కోల్‌కతా పోలీసులు మాత్రం తెల్లని దుస్తులు ధరిస్తారు. దీనికి కారణం ఏమిటంటే.. నిజానికి కోల్‌కతా పోలీసులు, బెంగాల్ పోలీసులు వేరు. 1861లో కోల్‌కతా పోలీసు వ్యవస్థ ఉంది. బ్రిటిష్ రాజ్ సమయంలో రూపొందించిన నిబంధనల ప్రకారం ఏర్పడిన రాష్ట్ర పోలీసుల నుండి భిన్నంగా ఇది నగరానికి మాత్రమే వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో కలకత్తా పోలీసుల దుస్తులు, వారికిప్రత్యేక గుర్తింపు కోసం ప్రత్యేక రంగులో తయారు చేయబడ్డాయి. కోల్‌కతా పోలీసులు ఇప్పటికీ బ్రిటీష్ కాలం నాటి పాత డ్రెస్ కోడ్‌నే అనుసరిస్తున్నారు. అంతే కాదు కలకత్తాలో చాలా వేడి ఉంటుందని, అందుకే వారు తెల్లటి  యూనిఫాంలు ధరిస్తారని, అది వారికి సౌకర్యాన్ని ఇస్తుందంటూ కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.