పైనాపిల్ ముక్కలను ఉప్పు నీళ్లలో కడిగి ఎందుకు తినాలి..?

పైనాపిల్ ముక్కలను ఉప్పు నీళ్లలో కడిగి ఎందుకు తినాలి..?

యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలతో నిండిన పైనాపిల్ (అనాసపండు) ఆరోగ్యానికి చాలామంది. అయితే... నాలుక చివర, గొంతులో దురద ఉంటుందని కొంతమంది పైనాపిల్ తినడానికి ఆలోచిస్తారు. పైనాపిల్ ముక్కల్ని నేరుగా తింటే దురద అనిపిస్తుంది. అంటున్నారు న్యూట్రిషనిస్ట్లు. అలాకాకుండా ఉండాలంటే ఎలా తినాలో కూడా చెప్పారు.

పైనాపిల్లో బ్రొమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఫుడ్ జీర్ణం కావడానికి సాయపడే ఈ ఎంజైమ్ వల్లనే నాలుక, గొంతు లోపల దురద పెడుతుంది. అందుకని పైనాపిల్ ముక్కల్ని కట్ చేసి ఒక కప్పు నీళ్లలోవేయాలి. అందులో టేబుల్ స్పూన్ ఉప్పు చల్లాలి. నిమిషం తర్వాత పైనాపిల్ ముక్కలు తింటే నాలుక దురద పెట్టదు. అంతేకాదు ఉప్పు చల్లడం వల్ల వాటి రుచి కూడా బాగుంటుంది.