లాయర్లను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలి: హైకోర్టు

 లాయర్లను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలి: హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదులు, క్లర్క్ లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలంటూ  వేసిన పిల్ పై  హైకోర్ట్ బుధవారం విచారణ చేపట్టింది. పిటిషన్ వినతిపై స్పందించిన హైకోర్టు న్యాయవాదులను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలని ప్రశ్నించింది. మీ బాగోగుల బాధ్యత ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని.. బార్ కౌన్సిల్ న్యాయవాద సంఘాలదే బాధ్యత అని న్యాయస్థానం స్పషం చేసింది. న్యాయవాదులు ప్రభుత్వం పై ఆధారపడొద్దని హైకోర్టు హితవు పలికింది. న్యాయవాదులు సొంత నిధిని ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. సీనియర్ న్యాయవాదుల సహకారంతో నిధిని ఏర్పాటు చేసుకోవాలని, కార్పస్ ఫండ్, పంపిణీ పై కమిటీ ఏర్పాటు చేసుకోవాలని బార్ కౌన్సిల్ కు సూచనలు చేసింది.