రోజూ చూస్తాం కదా.. : ట్రాక్టర్ టైర్లు వెనక పెద్దవిగా.. ముందు చిన్నగా ఎందుకుంటాయి..?

రోజూ చూస్తాం కదా.. : ట్రాక్టర్ టైర్లు వెనక పెద్దవిగా.. ముందు చిన్నగా ఎందుకుంటాయి..?

భారతదేశం వ్యవసాయానికి మారుపేరుగా ఉంది. ఇటువంటి వ్యవసాయం ప్రధానంగా కల్గిన దేశాలలో ట్రాక్టర్లను ఎక్కువగా చూడవచ్చు. భారతదేశంతో సహా అనేక దేశాలలో వ్యవసాయ కార్యకలాపాలకు ట్రాక్టర్లను ఉపయోగిస్తారు. ట్రాక్టర్లు చాలా సంవత్సరాలుగా వ్యవసాయంలో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. ట్రాక్టర్ల సైలెన్సర్లు ట్రాక్టర్ల పైభాగంలో ఉండే సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ ఆర్టికల్ లో ట్రాక్టర్లలోని చక్రాలను గురించి తెలుసుకుందాం.

 ట్రాక్టర్ వెనుక భాగం ఎందుకు పెద్ద టైర్లు ఉన్నాయో అర్థం చేసుకోవడానికి ముందు, ఇతర వాహనాల నుండి ఎలాంటి ట్రాక్టర్ భిన్నంగా ఉందో తెలుసుకోవడం ముఖ్యం. ట్రాక్టర్ అనే పదం లాటిన్ పదం ట్రాక్షన్ నుండి వచ్చింది. ట్రాక్షన్ అంటే డ్రా. ఈ పదాన్ని మొదట 1896 లో ఉపయోగించారు. ట్రాక్టర్లు వస్తువులను లాగడానికి రూపొందించబడ్డాయి. ఎందుకంటే దాని ముందు టైర్లు చిన్నవి మరియు వెనుక టైర్లు పెద్దవిగా ఉంటాయి. ట్రాక్టర్ యొక్క పని ఎక్కువ బరువును లాగడం కాబట్టి దాని వెనుక టైర్లు పెద్దవిగా ఉంటాయి. ట్రాక్టర్ ముందు టైర్ల వ్యాసార్థం చిన్నదిగా ఉన్నందున, వాటిని స్టీరింగ్ సహాయంతో సులభంగా తిప్పవచ్చు. ఈ కారణంగా ఫ్రంట్ టైర్లు చిన్నవిగా ఉంటాయి. అంతే కాకుండా దాని బరువును తేలికగా నియంత్రించడానికి సులభంగా ఉంటుంది. 

 ట్రాక్టర్లను సాధారణంగా కఠినమైన ఉపరితలాలపై, పొలాలలో మరియు బురద ప్రాంతాలలో ఉపయోగిస్తారు. ఇది వ్యవసాయానికి సంబంధించిన పనిని చేయగలదు. ఈ ప్రాంతాల్లో పెద్ద టైర్లు ఉపరితలంపై లేదా నేల మీద తిరుగుతాయి. టైర్ యొక్క పరిమాణం పెద్దగా ఉంటే, అది నేల నుండి సులభంగా బయటపడగలదు. పెద్ద టైర్లలో మంచి పట్టును అందిస్తాయి. అంతే కాకుండా ఇది సజావుగా ముందుకు సాగడానికి వీలు కల్పిస్తుంది. పెద్ద టైర్లు ఎక్కువ భారాన్ని మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 

 ట్రాక్టర్ కలిగి ఉన్న పెద్ద టైర్లు ఎక్కువ బరువును లాగడానికి అనుమతిస్తుంది. అయితే ఇది టైర్ల ఎత్తు, వెడల్పు మరియు గాలి పీడనం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ముందు టైర్లపై ఎక్కువ ఒత్తిడి కలిగించకుండా వెనుక టైర్లను సులభంగా లోడ్ చేయడానికి అనుమతిస్తుంది.

సోషల్ మీడియాలో రాహుల్ చౌదరి అనే వ్యక్తి ఈ విషయంపై స్పందించాడు.. మన చేతులు చిన్నవిగా ఉంటాయి.. కాని కాళ్లు పెద్దవిగా ఉంటాయి.  ట్రాక్టర్ లో కూడా వెనుక  ఉండే టైర్లు పెద్దవిగాను... ముందు ఉంటే  టైర్లు చిన్నవిగాను ఉన్నాయని వివరించాడు.  వినోద్ అనే వ్యక్తి  వెనుక పొడవైన కమ్మీలు ఉండి... చాలా బరువులు మోయాల్సి వస్తుందని .. పొలాల్లో దున్నడం లాంటి వాటికి ట్రాక్టర్లను ఉపయోగిస్తారు.  ముందు టైర్లు కేవలం సపోర్ట్ గా మాత్రమే ఉంటాయని తెలిపారు. హేమంత్ పోగ్డే   అనేవ్యక్తి ట్రాక్టర్లను చాలా బరువైన వస్తువులను తీసుకెళ్లేందుకు వాడతారు.  బ్యాలెన్స్ చేయడం కోసం వెనుక పెద్ద టైర్లు... ముందు చిన్న టైర్లు ఉంటాయని ఇలా ఎవరి అభిప్రాయం ప్రకారం వారు వివరించారు.