భారత్‌లో ఉండటం కోహ్లీకి ఇష్టం లేదు.. అందుకే లండన్‌లో సెటిల్! 

భారత్‌లో ఉండటం కోహ్లీకి ఇష్టం లేదు.. అందుకే లండన్‌లో సెటిల్! 

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్‌సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీకి భారత్‌లో ఉండటం ఇష్టం లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ లియామ్ లివింగ్ స్టోన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రశాంతమైన జీవితాన్ని విరాట్ కోహ్లీ కోరుకుంటున్నాడని, తన ఫ్యామిలీతో ఎక్కువ సమయాన్ని గడపాలనుకుంటున్నాడని పేర్కొన్నాడు. అందుకోసమే అతడు లండన్‌లో సెటిల్ అయ్యాడని తెలిపాడు.

ప్రస్తుతం భారత్‌తో తాను గడుపుతున్న జీవితాన్ని విరాట్ కోహ్లీ పెద్దగా ఇష్టపడటం లేదు.. అందరి కళ్లూ ఎప్పుడూ తనపైనే ఉండాలని అతను అస్సలు అనుకోడని పేర్కొన్నాడు. కోహ్లీ చాలా మంచి వ్యక్తి.. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిథ్యం వహించిన లియామ్ లివింగ్ స్టోన్.. తాజా సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరపున ఆడాడు.. ఇటీవలే ఐపీఎల్ ముగియడంతో స్వదేశానికి వెళ్లిన లివింగ్ స్టోన్.. అక్కడ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లతో కలిసి ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కింగ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు.  

విరాట్ కోహ్లీ అద్భుతమైన వ్యక్తి.. నేను ఎప్పుడూ అతనికి ప్రత్యర్థిగానే ఆడా.. కోహ్లీ ఎప్పుడూ స్మైల్ తోనే కనిపిస్తాడు. అతనితో గొడవకు దిగితే అదే రీతిలో సమాధానం ఇస్తాడు. కానీ స్టేడియంలో మాత్రం పోటీతత్వంతో ఆడుతాడు. కోహ్లీ.. బౌండరీ లైన్ దాటి మైదానంలో అడుగు పెట్టగానే మారిపోతాడు.. కానీ గ్రౌండ్ బయట అతను అద్భుతమైన వ్యక్తి.. చాలా ప్రశాంతంగా ఉంటాడని లివింగ్ స్టోన్ వెల్లడించాడు. 

ALSO READ : ఐపీఎల్‌లో తోపు.. మహారాజా ట్రోఫీలో కేఎల్ రాహుల్ని పట్టించుకోని ఫ్రాంచైజీలు

ఆర్‌సీబీ కోచింగ్ స్టాఫ్ మోబాట్, ఆండీ ఫ్లవర్ విరాట్ కోహ్లీ ఆడే విధానాన్ని పూర్తిగా మార్చేశారని లియామ్ లివింగ్ స్టోన్ చెప్పుకొచ్చాడు. కొంచెం దూకుడుగా ఆడాలని, సిక్సర్లు కొట్టాలని కోహ్లీకి సూచించడంతో.. అతడి ఆటతీరు పూర్తిగా మారింది. గతానికి భిన్నంగా కోహ్లీ దూకుడుగా ఆడుతున్నాడు. స్పిన్ బౌలింగ్‌లోనూ భారీ షాట్స్ కొడుతున్నాడని లివింగ్ స్టోన్ పేర్కొన్నాడు.