జవాన్ భార్యకు 18 ఏండ్ల తర్వాత ఎక్స్ ‌‌‌‌గ్రేషియా

జవాన్ భార్యకు 18 ఏండ్ల తర్వాత ఎక్స్ ‌‌‌‌గ్రేషియా

న్యూఢిల్లీ: ఎలక్షన్ డ్యూటీలో మరణించిన సీఆర్పీఎఫ్‌‌‌‌ జవాను భార్యకు 18 ఏండ్ల తరువాత ఎక్స్‌‌‌‌గ్రేషియా అందింది. ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ రూ.20 లక్షలు ఆమె బ్యాంక్‌‌‌‌ అకౌంట్‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఎక్స్‌‌‌‌గ్రేషియా చెల్లింపులో ఆలస్యానికి క్షమాపణలు కోరుతూ సీఈసీ సునీల్‌‌‌‌ అరోరా ఆమెకు లెటర్‌‌‌‌‌‌‌‌ రాశారు. 2002 జమ్మూకా శ్మీర్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ ఎలక్షన్స్‌‌‌‌లో దోడా టౌన్‌‌‌‌ హాల్‌‌‌‌ ఏరియాలోని పోలింగ్‌‌‌‌ బూత్‌‌‌‌ వద్ద టెర్రరిస్టులతో ఫైట్‌‌‌‌ చేస్తూ 45 బెటా లియన్‌‌‌‌లో పనిచేస్తున్న రమేశ్‌ కుమార్‌‌‌‌‌‌‌‌ మరణించారు. ఆ సమయంలో
రమేశ్‌ భార్య ప్రమీలా దేవికి అందాల్సి న ఎక్స్‌‌‌‌గ్రేషియా ఇప్పటి దాకా పెండింగ్‌‌‌‌లోనే ఉంది. హర్యానాలోని భివానిలో ఉంటున్న ప్రమీల.. ఎక్స్‌‌‌‌గ్రేషియా ఇప్పించాలని కోరుతూ ఎలక్షన్‌‌‌‌ కమిషన్ కు 2019 డిసెం బర్‌‌‌‌‌‌‌‌లో లెటర్‌‌‌‌‌‌‌‌ రాశారు. ఆ లెటర్‌‌‌‌‌‌‌‌ను జమ్మూ కా శ్మీర్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌ ఎలక్టో రల్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌కు ఈసీ ఫార్వర్డ్‌‌‌‌ చేసింది. 2002 లో ఎక్స్‌‌‌‌గ్రేషియా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. ఇన్ని సంవత్సరాలు ఆలస్యంచేసిన కారణంగా ఇప్పటి లెక్కల ప్రకారం రూ.20 లక్షలు ఇచ్చింది.