భర్త కళ్లెదుటే లారీ కిందపడి భార్య మృతి

V6 Velugu Posted on Sep 22, 2021

మేడ్చల్ జిల్లా: భర్త కళ్లెదుటే భార్య లారీ కింద పడి చనిపోయింది. మెడ్చల్ చెక్ పోస్ట్ వద్ద బుధవారం జరిగిందీ రోడ్డు ప్రమాదం. ఓల్డ్ బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్న మంజుల ఆమె భర్త శ్రీనివాస్ ద్విచక్ర వాహనంపై వారి సొంత ఊరు మానేపల్లికి ఆదివారం వెళ్లి.. ఈ రోజు స్కూటీపై తిరిగి వస్తుండగా మార్గం మధ్యంలో మేడ్చల్ చెక్ పోస్ట్ జంక్షన్ వద్ద అదుపుతప్పి భార్య లారీ కింద పడింది.

తూప్రాన్ నుండి వస్తున్న లారీ శామీర్ పేట్ మజీద్ పూర్  వైపునకు వెళ్లేందుకు లారీ మరలుతుండగా లారికి ఎడమ వైపునన్న దంపతుల ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. బైకు వెనుక కూర్చునన మంజుల వాహనంపై నుంచి ఎగిరి లారీ వైపునకు రోడ్డుపై పడిపోగా.. లారీ వెనకచక్రాలు మంజుల పై నుండి వెళ్లాయి. ప్రమాదంలో మంజుల తన భర్త ముందే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More News:

బైడెన్ పిలుపు.. మోడీ అమెరికా ప్రయాణం

ఆ స్వామీజీది హత్యా? ఆత్మహత్యా?

క్లైమాక్స్‌కు వచ్చిన తన్నులాట.. తెలంగాణ నువ్వెటు వైపు?

రాళ్లను కలెక్ట్​ చేస్తున్న పద్నాలుగేళ్ల సైంటిస్ట్

Tagged medchel district, , medchel checkpost, medchel checkpost junction, lorry hit byke, manjula wife, srinivas husband, manepalli village

Latest Videos

Subscribe Now

More News