రాళ్లను కలెక్ట్​ చేస్తున్న పద్నాలుగేళ్ల సైంటిస్ట్

రాళ్లను కలెక్ట్​ చేస్తున్న పద్నాలుగేళ్ల సైంటిస్ట్

పిల్లలు బీచ్​కు వెళ్తే  ఇసుకలో బాగా ఆడుకుంటారు. కానీ ఈ పద్నాలుగేళ్ల పాప మాత్రం పెంకులను, రాళ్లను కలెక్ట్​ చేస్తుంది. వాటి గురించి రీసెర్చ్​ చేస్తుంది. అలా పదేళ్ల నుంచే వీటిపై రీసెర్చ్​ చేస్తున్న ఈ పాప పేరు అశ్వథ బిజు. 

అశ్వథకు దేశంలోనే యంగెస్ట్​ ప్యాలియంటాల జిస్ట్​ ( జంతు శిలాజాలను స్టడీ చేసే సైంటిస్ట్​) గా పేరుంది.  ఇప్పటి వరకు 136  శిలాజాలు కలెక్ట్​ చేసింది.  అశ్వథకు తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు మొదటిసారి చెన్నయ్​లోని ఎగ్మూర్​ మ్యూజియానికి వెళ్లింది. అక్కడ  అమ్మోనైట్‌‌ శిలాజాలను చూసింది. దాన్ని చేతితో తాకినప్పుడు  థ్రిల్లింగ్​గా ఫీలయింది. అలాంటి శిలాజాలు ఎన్నో ఉంటాయని తెలుసుకుంది. అప్పటి నుంచి శిలాజాలను వెతకడం మొదలుపెట్టింది. అలా అశ్వథ  పెరియార్‌‌ యూనివర్శిటీ జియాలజీ ప్రొఫెసర్‌‌ ఎంయు రామ్‌‌కుమార్‌‌ను కలుసుకున్నది.  ఆయన ద్వారా  ఇన్​స్పైర్​ అయింది.  శిలాజాలను ఎక్కడ? ఎలా కనుగొనాలి? వాటిని ఎలా చూసుకోవాలి? వంటి ఎన్నో వివరాలు ఆయన నుంచి నేర్చుకుంది. తరువాతి నాలుగు సంవత్సరాల్లో తమిళనాడులోని అరియలూర్‌‌, గుండుపెరుంబేడు, మహారాష్ట్రలోని గడ్చిరోలి, సిరొంచా ప్రాంతాలకు వెళ్లి శిలాజాలను కనుక్కొంది.  పాలియాంటాలజీలో తన  ఎక్స్​పీరియన్స్​ గురించి సెమినార్లు నిర్వహించడానికి స్కూల్స్​, కాలేజ్​లు, మ్యూజియంలు అశ్వథను  పిలుస్తుంటాయి. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న అశ్వథ  రోజులో కాసేపే చదువుకుం టుంది. ఆ తర్వాత పాలియాంటాలజీ పనిలోనే ఉంటుంది. ఖాళీ టైం దొరికితే కొత్త టెక్నాలజీ, కొత్త శిలాజాల గురించి వెతుకుతుంది.బాగా చదువుకొని, విదేశాల్లో మాలిక్యులర్‌‌ పాలియాంటాలజీ  చదవాలి అనేది ఆ పాప గోల్​.