వేధింపుల భర్తకి ఏడాది జైలు శిక్ష

వేధింపుల భర్తకి ఏడాది జైలు శిక్ష

ఆసిఫాబాద్: రోజూ తాగివచ్చి కొట్టడం. అదనపు డబ్బు కోసం వేధించడం. అలాంటి భర్తతో కొన్ని రోజులుగా భరించిన భార్య చివరకు విసుగు చెందింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ మృగాడు కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. తిర్యాని గ్రామానికి చెందిన పొడిశెట్టి ప్రసాద్ అనే వ్యక్తి తన భర్య శాంతను వరకట్నం కోసం వేధిస్తున్నాడు. నిత్యం తాగివచ్చిన చితకబాదుతున్నాడు. బాధలు భరించలేక శాంత తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన ఆసిఫాబాద్ జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్టేట్ సురేశ్ శాంత భర్త ప్రసాద్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పుఇచ్చారు.