
దుబ్బాక, వెలుగు : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హతమార్చింది. సీఐ మున్నూరు కృష్ణ కథనం ప్రకారం..సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం రామేశ్వరంపల్లికి చెందిన మైలీ నవీన్(35) గల్ఫ్ వెళ్లి వచ్చి ఊరిలో ఆటో నడుపుకుంటున్నాడు. ఇతడి భార్య ఉదయ రాణి ఇదే గ్రామానికి చెందిన శ్యామ తరుణ్(సబ్ స్టేషన్ ఆపరేటర్)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
దీంతో తరుణ్, ఉదయరాణి కలిసి నవీన్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి నవీన్‌కు తరుణ్ మద్యం తాగించాడు. అతడు ఇంటికి వచ్చి పడుకున్నాక ఇద్దరూ కలిసి నవీన్‌ను సంపులో ముంచి చంపేశారు. తెల్లవారుజామున ఉదయరాణి నవీన్ సోదరుడికి ఫోన్‌చేసి భర్త లేవడం లేదని చెప్పింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఉదయరాణి, తరుణ్‌ను విచారించడంతో నిజం ఒప్పుకున్నారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.