బెంగళూరులో దారుణం..భార్యను ఉద్యోగం నుంచి తీసేశారని.. యజమానిపై దాడి చేసిన భర్త

బెంగళూరులో దారుణం..భార్యను  ఉద్యోగం నుంచి తీసేశారని.. యజమానిపై దాడి చేసిన భర్త

భార్యను ఉద్యోగం నుంచి తొలగించారన్న కోపంతో  భర్త  దారుణానికి పాల్పడ్డాడు.  యజమానిపైనే తన గ్యాంగ్‌తో కలిసి దాడి చేశాడు.  ఈ ఘటన బెంగళూరులో జరిగింది. 

అసలేం జరిగిందంటే.. ఉత్తర బెంగళూరులోని అవలహళ్లి ప్రాంతంలో ఉన్న  స్కిన్ షైన్ యూనిసెక్స్ సెలూన్  యజమాని మోహన్ కుమార్.. సుష్మ అనే ఉద్యోగినిని ఇటీవల పనిలో నుంచి తొలగించారు. దీంతో కక్ష పెంచుకున్న సుష్మ భర్త  ఏప్రిల్ 4న  సాయంత్రం సుమారు 5:40 గంటలకు తన అనుచరులతో కలిసి సెలూన్‌లోకి వెళ్లాడు.  నిందితుడు తనతో పాటు మరో నలుగురు ఐదుగురు వ్యక్తులను వెంటబెట్టుకొచ్చి  యజమాని మోహన్ కుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో మోహన్ కుమార్ భార్య శ్రీజ అడ్డుకోవడానికి ప్రయత్నించగా నిందితులు ఆమెపై కూడా దాడి చేసి గాయపరిచారు.

►ALSO READ | పుణె ఇంజనీరింగ్ క్యాంపస్‎లో ఘోరం: వ్యాయామం చేస్తుండగా బాస్కెట్ బాల్ పోల్ మీదపడి యువకుడు మృతి

ప్రస్తుతం బాధితుడు మోహన్ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మొత్తం ఘటన సెలూన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. బాధితుల ఫిర్యాదు మేరకు అవలహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.