
కోల్బెల్ట్/కాసిపేట, వెలుగు: వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని.. మానవులు, వన్యప్రాణులకు మధ్య పెరుగుతున్న సంఘర్షణ నుంచి సహజీవనం దిశగా మర్చేందుకు కృషి చేయాలని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ఆఫీసర్ పి.సంతోష్ అన్నారు. జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా బుధవారం రామకృష్ణాపూర్లోని తవక్కల్ హైస్కూల్ స్టూడెంట్లకు వన్యప్రాణుల అవశ్యకతపై అవగాహన కల్పించారు.
వన్యప్రాణులు సంరక్షణ, బయోడైవర్సిటీ, పర్యావరణ సమతుల్యత గురించి వివరించారు. ప్రతి ఏటా అక్టోబర్ 2 నుంచి 8 వరకు జాతీయ వన్యప్రాణుల వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. అనంతరం నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన స్టూడెంట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు రాజేశ్వరి, రమేశ్, రజిత, శ్రావణ్ కుమార్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
వన్యప్రాణుల రక్షణకు అన్ని చర్యలు
వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముత్యంపల్లి డిప్యూటి రేంజ్ఆఫీసర్బి.ప్రవీణ్ నాయక్ అన్నారు. జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా వన్యప్రాణుల రక్షణపై కాసిపేట మండలం ముత్యంపల్లి సెక్షన్ పరిధిలోని మల్కపల్లి ప్రభుత్వ ఆశ్రమ హైస్కూల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
వన్యప్రాణులకు రక్షించేందుకు అటవీశాఖ అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థి దశనుంచే వన్యప్రాణులు, పర్యావరణపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వన్యప్రాణుల రక్షణ, వాటి అవశ్యకత గురించి వీడియో ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్, బీట్ఆఫీసర్ శ్రీధర్, టీచర్లు పాల్గొన్నారు.