హైకమాండ్‌‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. అధికార మార్పుపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య కామెంట్‌‌

హైకమాండ్‌‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. అధికార మార్పుపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య కామెంట్‌‌

బెళగావి (కర్నాటక): కర్నాటకలో అధికార మార్పు విషయంలో హైకమాండ్‌‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎం సిద్ధరామయ్య మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదని అధిష్టానం చెప్పిందంటూ సిద్ధరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర చేసిన వ్యాఖ్యలపై సోమవారం సిద్ధరామయ్యను మీడియా ప్రశ్నించగా, ఆయన సమాధానం చెప్పారు.

 ప్రస్తుతానికి కర్నాటకలో సీఎం మార్పు ఉండదని హైకమాండ్‌‌ చెప్పిందని యతీంద్ర అన్నారు. ఇటీవల నిర్ణయించిన ఓ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని అధిష్టానం చెప్పిందన్నారు. అధికార మార్పుపై వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దానిని వాయిదా వేశారని అన్నారు. కాబట్టి రాష్ట్రంలో ప్రస్తుతానికి నాయకత్వ మార్పుపై చర్చలేదని యతీంద్ర ఇటీవల స్పష్టం చేశారు.