రాష్ట్రపతి రాజీనామాకు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తారా?

రాష్ట్రపతి రాజీనామాకు బీజేపీ నేతలు డిమాండ్ చేస్తారా?

మహారాష్ట్రలో రాజకీయం టిప్పు సుల్తాన్ చుట్టూ తిరుగుతోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ముంబైలోని ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు టిప్పు సుల్తాన్‌ పేరును పెట్టడంపై ప్రతిపక్ష బీజేపీ, బజరంగ్ దళ్ ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా ఆందోళనలకు దిగాయి. లేదంటే సీఎం రాజీనామా చేయాలని నిరసనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ కౌంటర్ అటాక్‌కు దిగింది. గతంలో టిప్పు సుల్తాన్‌ను బీజేపీ నేతలు సైతం పొగిడారని శివసేన నేతలు గుర్తు చేస్తున్నారు. ఇవాళ శివసేన సీనియర్ లీడర్ సంజయ్ రౌత్ ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ఏకంగా గతంలో రాష్ట్రపతి చేసిన ప్రసంగాన్ని గుర్తు చేస్తూ కామెంట్ చేశారు.

2017 సంవత్సరంలో కర్ణాటక అసెంబ్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో టిప్పు సుల్తాన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పొగిడారని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. టిప్పు సుల్తాన్ చారిత్రక యోధుడని, ఆయనో ఫ్రీడం ఫైటర్ అని కోవింద్ కీర్తించారని అన్నారు. అంటే ఆయనను గొప్పగా పొగిడినందుకు ఇప్పుడు రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తారా అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. దీనిపై బీజేపీ తన డ్రామాలను కట్టిపెట్టి, క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు తమకు మాత్రమే చరిత్ర తెలుసని, వాళ్లు చెబితే మిగతా వాళ్లంతా సరికొత్త చరిత్రను రాసుకోవాలన్నట్లుగా భావిస్తుంటారని ధ్వజమెత్తారు. చరిత్రను మార్చడమే తమ పని అన్నట్టుగా వాళ్లు (బీజేపీ నేతలు) ఫీలవుతున్నారని,  టిప్పు సుల్తాన్ గురించి తమకు తెలుసని, ఇప్పుడు కొత్తగా బీజేపీ వాళ్లు చెబితే నేర్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు

యూపీ వెనుకబడితే.. దేశం వెనుకబడినట్లే

భారత్ బాలుడిని తిరిగి అప్పగించిన చైనా