ఆర్టికల్ 370 రద్దుపై చట్టపరంగా పోరాడుతాం

ఆర్టికల్ 370 రద్దుపై చట్టపరంగా పోరాడుతాం

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ విషయంలో రాజ్యాంగ మార్పుల ద్వారా తాము మోసపోయామని నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేతలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా అన్నారు. జమ్మూ కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తి, ఆర్టికల్ 370 రద్దయి ఏడాది గడిచింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి, ఆర్టికల్ 370 ద్వారా వచ్చే ప్రత్యేక అధికారాలను రాజకీయంగా, చట్టపరంగా, ప్రజాస్వామ్యయుతంగా రాడి దక్కించుకుంటామని ఫరూక్, ఒమర్ స్పష్టం చేశారు. తమ పోరాటం పూర్తిగా శాంతియుతంగా కొనసాగుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్ లో హిందూ ముస్లింల మధ్య విద్వేష భావన పెరుగుతోందన్నారు. కాశ్మీరీ వీధులు ఇండియాలో భాగం కాదని చెప్పారు.

‘మీరు నిజం తెలుసుకోవాలంటే వాళ్లు (కాశ్మీరీలు) భారత్ లో భాగం కాదు. ఇది దేవుడి సత్యం. మీరు సాధారణ ప్రజలను అడగండి. వాళ్లు పాకిస్తానీలు కావాలని అనుకోవట్లేదు. దీని గురించి నిజాలు మాట్లాడుకుందాం. వాళ్లు పాకిస్తానీ కాదు కానీ కేంద్రం చేసిన దానికి ఇవ్వాళ అతడు ఇండియన్స్ గా కూడా లేరు. గతేడాది ఆగస్టు 5కు ముందు వేర్పాటువాదమే లేదు. ఇవ్వాళ పాకిస్తానీలు కాదు కాశ్మీరీలు చనిపోతున్నారు. వాళ్లను మిలిటెంట్లుగా చిత్రీకరించారు. బీజేపీయే వాళ్లను క్రియేట్ చేసింది. మొత్తం దేశంలో హిందూ ముస్లింల మధ్య ద్వేష భావం పెరుగుతోంది. ఆ ప్రభావం ఇక్కడ లేదనుకుంటున్నారా?’ అని ఫరూక్ చెప్పారు.