సీఎం ఆదేశిస్తే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తా : డీహెచ్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌రావు

సీఎం ఆదేశిస్తే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తా : డీహెచ్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌రావు

సుజాతనగర్, వెలుగు: సీఎం కేసీఆర్ ఆదేశిస్తే కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్‌‌‌‌రావు తెలిపారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఉద్దేశంలో ప్రజాసేవ అంటేనే రాజకీయాలు అని, రాజకీయాలంటే సమాజ సేవ అని, కాబట్టి తాను రాజకీయాల్లో ఉన్నట్టేనని పేర్కొన్నారు.

ఈ ప్రాంతంలో యువత రాజకీయాల్లోకి రావాలని డీహెచ్‌‌‌‌ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 8,9 తేదీల్లో కొత్తగూడెంలో యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జీఎస్సార్ ట్రస్ట్ తరఫున ఈ నెల 26న సుజాతనగర్ మండలం కేంద్రంలో హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్లతో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు.