Spirit: సందీప్‌‌‌‌ రెడ్డి వంగా ప్లాన్ అదిరింది.. ప్రభాస్‌‌‌‌తో స్టార్ హీరోయిన్ రొమాన్స్!

Spirit: సందీప్‌‌‌‌ రెడ్డి వంగా ప్లాన్ అదిరింది.. ప్రభాస్‌‌‌‌తో స్టార్ హీరోయిన్ రొమాన్స్!

ప్రభాస్‌‌‌‌ హీరోగా సందీప్‌‌‌‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌‌‌‌పై ఎంతో ఆసక్తిగా ఉన్న అభిమానులు ఎప్పుడెప్పుడు అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రెండు క్రేజీ అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ వచ్చాయి. అందులో షూటింగ్ అప్‌‌‌‌డేట్ కాగా, మరొకటి హీరోయిన్‌‌‌‌ గురించి.

బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్‌‌‌‌గా నటించబోతోందని తెలుస్తోంది. ప్రభాస్‌‌‌‌ ‘కల్కి’చిత్రంలో దీపిక కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే జంటగా నటించలేదు. ఈసారి ‘స్పిరిట్‌‌‌‌’లో మాత్రం ప్రభాస్‌‌‌‌కు జోడీగా  కనిపించబోతోంది. ప్రస్తుతం షారుఖ్ సరసన ‘కింగ్’లో నటిస్తున్న దీపిక.. ‘స్పిరిట్’కోసం కూడా కాల్‌‌‌‌షీట్లు కేటాయించినట్టు సమాచారం.

నిజానికి ‘కల్కి’టైమ్‌‌‌‌లోనే ఈ ప్రాజెక్ట్‌‌‌‌పై కూడా ఆమె ఆసక్తి చూపించింది. కానీ తన ప్రెగ్నెన్సీ కారణంగా అప్పట్లో హామీ ఇవ్వలేదట. అయితే ‘స్పిరిట్‌‌‌‌’ఆలస్యమవడంతో మళ్లీ ఈ జంట కలిసి కనిపించే అవకాశం దక్కింది. ఇక ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని, 2027 ప్రారంభంలో విడుదల చేస్తామని నిర్మాత భూషణ్‌‌‌‌ కుమార్ వెల్లడించారు.