నీట్‌‌ వ్యతిరేక బిల్లుకు ఎప్పటికీ క్లియరెన్స్ ఇవ్వను: గవర్నర్ ఆర్.ఎన్.రవి

నీట్‌‌ వ్యతిరేక బిల్లుకు ఎప్పటికీ క్లియరెన్స్ ఇవ్వను: గవర్నర్ ఆర్.ఎన్.రవి

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎంట్రన్స్- కమ్- ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) వ్యతిరేక బిల్లును ఎప్పటికీ క్లియర్ చేయబోనని ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌‌ఎన్.రవి స్పష్టం చేశారు. ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినప్పటికీ, తుది నిర్ణయం తీసుకునే వ్యక్తిని తానేనని వెల్లడించారు. 

శనివారం ఆయన రాజ్‌‌భవన్‌‌లో  నీట్–2023 టాప్ స్కోరర్‌‌లతో  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమిళనాడులో  నీట్​ను మినహాయించాలని కోరుతూ ప్రభుత్వం తెచ్చిన బిల్లుకు ఆమోదం లభిస్తుందా అని నీట్ టాప్ స్కోరర్ల పేరెంట్స్ ప్రశ్నించారు. దీనికి గవర్నర్‌‌ జవాబిస్తూ..“నేను నీట్ (బిల్లు)కు ఎప్పటికీ క్లియరెన్స్ ఇవ్వనని మీకు చాలా స్పష్టంగా చెబుతున్నాను. 

ఉమ్మడి జాబితాకు చెందిన అంశం కాబట్టి ఆ బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లింది. దేశమంతా నీట్ ఎగ్జామ్​ ఉంటుంది” అని వివరించారు. నీట్‌‌ లేకుండా స్టూడెంట్లు సాధించిన విజయాలు వారి భవిష్యత్తుకే మంచిది కాదని తెలిపారు.