పవర్ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా?  

పవర్ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా?  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన మేనల్లుడు సాయితేజ్(SaiTej) కథానాయకులుగా నటిస్తున్న మూవీ `బ్రో`. తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని(Samuthirakani) ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. తాజా సమాచారం మేరకు బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను రాజమండ్రి లో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే పవన్ ప్రస్తుతం వారాహీ యాత్ర(Vaarahi Yatra) కుడా రాజమండ్రి లో నడవడమే ఈవెంట్ కి కారణం అంటున్నారు సినీ క్రిటిక్స్. ఎందుకంటే పవన్ వారాహి యాత్రకు వస్తున్న స్పందనతో భారీ ఈవెంట్ ను  అక్కడ ప్లాన్ చేషినట్లు తెలుస్తోంది. 

రీసెంట్ గా టాలీవుడ్ నిర్మాతలు పవన్ ఎక్కడ ఉంటే అక్కడే తమ సినిమా షూటింగ్ అని ప్రకటించిన విషయం తెలిసిందే. అలా రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మరో కారణం అయ్యుండొచ్చని టాక్ వినిపిస్తోంది.   

ALSO READ:టూ మచ్ రా.. : ఉద్యోగులతో.. పచ్చి కాకర కాయలు తినిపించిన కంపెనీ

ఈ మూవీ లో పవన్ కళ్యాణ్  దేవుడుగా కనిపించబోతున్నాడు. గతంలో  పవన్ గోపాలా గోపాల మూవి లో దేవుడి  పాత్రలో నటించడం తెలిసేందే. ఇక తమిళ వినోదయ సీతం రీమేక్ గా రాబోతున్న బ్రో మూవీ లో పవన్ రోల్ చాలా ఇంపాక్ట్ ఇస్తోందని సమాచారం. ఈ మూవీ లో  సాయి ధరమ్ తేజ్ భక్తుడిగా కనపించనున్నాడు.

 ఇక ఈ మూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మాటలు అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మిస్తుండగా, థమన్(Thaman) మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ ఈ జూలై 28న గ్రాండ్ గా ఈ రిలీజ్ కాబోతుంది.