చార్జీలను ఒకేసారి పదిరెట్లు పెంచుతారా?

చార్జీలను ఒకేసారి పదిరెట్లు పెంచుతారా?

భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచి మూడు నెలలు కూడా కాకముందే డాక్యుమెంట్ ఫీజులు, యూజర్ చార్జీలను సైతం రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచడం దారుణం. గతంలో పది రూపాయలు ఉన్న మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్ చార్జీని వంద రూపాయలకు పెంచడం సరికాదు. అలాగే వంద రూపాయలు ఉన్న డాక్యుమెంట్ చార్జీని ఒకేసారి వెయ్యి రూపాయలకు పెంచడం ఎంత వరకు సమంజసం. ఇది ప్రజల రక్తాన్ని పీల్చడమే అవుతుంది. చార్జీలను రెట్టింపు చేయడమే దారుణం అంటే.. కొన్ని రకాల చార్జీలను పది రెట్లు పెంచడం అనేది అత్యంత దుర్మార్గం. పెంచిన చార్జీలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమీక్ష చేయాలి. కొన్ని సేవలపై రెట్టింపు కన్నా ఎక్కువ పెంచిన ఫీజులను, చార్జీలను వెంటనే తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజలపై మోపిన భారాన్ని దించాలి. లేకుంటే ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం.
                                                                                                                                             - పసునూరి శ్రీనివాస్, మెట్ పల్లి, జగిత్యాల జిల్లా