రెండు ఆస్పత్రులపైనే చర్యలా ?. మిగతావాటి సంగతేంది?

రెండు ఆస్పత్రులపైనే చర్యలా ?. మిగతావాటి సంగతేంది?

హైదరాబాద్, వెలుగు: దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్‌‌ ఆస్పత్రులు, ల్యాబ్‌లపై రాష్ట్రప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘46 ఆస్పత్రులకు నోటీసులు ఇస్తే 16 మాత్రమే రిప్లయ్ ఇచ్చాయని ఆఫీసర్లు చెబుతున్నారు. అంటే మిగిలిన వాటిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది. రెండు ఆస్పత్రుల్లోమాత్రమే ట్రీట్మెంట్ అనుమతుల్ని రద్దు చేశామని చెబుతున్నారు.. మిగిలిన ఆస్పత్రుల పై తీసుకున్న చర్యల మాటేమిటి” అని నిలదీసింది. రోజుకు 40 వేల కరోనా టెస్టులు చేయాలని తీసుకున్న కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మహబూబాబాద్, కామా రెడ్డి, ఆసిఫాబాద్, నర్సంపేట, కొత్తగూడెం, గద్వాల, వరంగల్ జిల్లాల్ లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్ లేవని పేర్కొంది. రాష్ట్రంలో కరోనా టెస్ట్‌‌లు సరిగ్గా చేయడం లేదని, ప్రైవేట్‌‌ ఆస్పత్రులు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని పేర్కొంటూ దాఖలైన పలు పిల్స్  గురువారం చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌ఎస్‌‌చౌహాన్, జస్టిస్‌‌ బి.వి జయ్‌‌సేన్‌‌ రెడ్డితో కూడిన డివిజన్‌ బెంచ్‌‌ సుదీర్ఘంగా విచారించింది. విచారణకు చీఫ్‌‌సెక్రటరీ సోమేశ్ కుమార్, హెల్త్ ఆఫీసర్లు హాజరయ్యారు.

‘‘ప్రైవేట్‌‌ ఆస్పత్రులపై 1,091 కంప్లయింట్స్‌ ‌వచ్చాయని, అధిక బిల్లుల వసూళ్లపై 149, ల్యాబ్స్‌‌లో టెస్ట్‌‌ లకు అధిక ఫీజులపై 14, బీమాకు చెందినవి 16 కంప్లైంట్స్‌‌ వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. మరి వాటిపై తీసుకున్న చర్యల గురించి ఎందుకు చెప్పడం లేదు” అని హైకోర్టుప్రశ్నించింది. రూల్స్ పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిం ది. 15 నుంచి 25 శాతం బెడ్స్‌ ‌ఉచితంగా పేదలకు కేటాయించి, ట్రీట్మెంట్ అందిస్తామని ప్రభుత్వం నుంచి భూమిని తీసుకున్నప్పుడు చెప్పిన ప్రైవేటు హాస్పి టల్స్ ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని, దీనిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకో వడం లేదని నిలదీసింది. ప్రభుత్వం 86 ఐసోలేషన్‌ సెంటర్స్‌‌ లిస్ట్‌‌ఇవ్వలేదని, ఫంక్షన్‌ హాల్స్, కమ్యూనిటీ హాల్స్‌‌ను ఐసోలేషన్‌సెంటర్స్‌‌గా చేసిందీలేనిదీ కూడా చెప్పలేదని హైకోర్టుతప్పుపట్టిం ది. కరోనా ప్రభావం 21 నుంచి 50 ఏండ్లమధ్య వయసు వాళ్లపై ఎక్కువగా ఉందని, వాళ్లుతీసుకోవాల్సిన జాగ్రత్తలను హెల్త్‌‌బులి టెన్‌లో పేర్కొనాలంటే ఈ నెల 13వ తేదీ బులిటెన్‌లో ఎందుకు వివరించలేదని ప్రశ్నించింది.

లెక్కలు కాదు.. ఆధారాలు చూపండి

టెస్టులు చేయడంపై లెక్కలు చెప్పడం కాదని, వాటికి ఆధారాలు చెప్పకపోతే ఎట్లని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టుప్రశ్నించింది. ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకూ 1,78,609 టెస్టులు చేస్తే.. అందులో ప్రైమరీ కాంటాక్ట్స్50,662, సెకండరీ కాంటాక్ట్స్42,210 కే సులున్నట్లు లెక్కలు చెబుతున్నారేగానీ వీటికి ఎలాంటి ఎవిడెన్స్‌‌లు ఇవ్వడం లేదని తప్పుపట్టింది. ర్యాపిడ్‌‌ యాంటీజెన్‌ టెస్ట్‌‌లు ఎంత వరకు సక్సెస్‌ ‌అయ్యాయో ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పలేదని, ఈ టెస్టుల్లో 40 శాతం మాత్రమే ఫలితం ఉంటుందనే అభిప్రాయాలు వస్తున్నాయని వ్యాఖ్యానించింది. యాంటీజెన్‌టెస్ట్‌‌ లపై ఎక్స్పర్ట్స్ కమిటీతో స్టడీ చేయించాలని చెబితే ప్రభుత్వంలో ఉలుకూ పలుకు లేదని మండిపడింది.

గ్రేటర్లో కరోనా తగ్గుతున్నది: సీఎస్‌‌

విచారణలో సీఎస్‌‌సోమేశ్ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘కరోనా కట్టడికి సిబ్బంది రాత్రి పగలు కష్ట పడుతు న్నారు. ర్యాపిడ్‌ ‌యాంటీజెన్‌టెస్టులు చాలా ఉపయోగ పడుతున్నాయి. జీహెచ్‌‌ఎంసీలో కరోనా తగ్గుముఖం పడుతోంది” అని చెప్పారు. రాష్ట్రంలో రోజూ 40వేల టెస్టులు చేయాలని కేబినెట్ నిరయ్ణం తీసుకుందని అన్నారు. ‘‘అన్ని బెడ్స్‌‌ను ఆక్సిజెన్‌ బెడ్స్‌‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నం. 15 నిమిషాల్లో ఫలితం వెలువడే ర్యాపిడ్‌‌యాంటీజెన్‌ టెస్టులను ఎక్స్పర్ట్స్ కమిటీ స్టడీ చేసి నిర్ధారించింది. ఆర్‌టీపీసీఆర్‌ అయితే మూడు రోజుల సమయం పడుతుంది. అందుకే ర్యాపిడ్‌‌ టెస్ట్‌‌ లకు ప్రాధాన్యత ఇస్తున్నం” అని వివరించారు. ప్రైవేట్‌‌ ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అపార్థం చేసుకోవద్దు: హైకోర్టు

‘‘కరోనా కట్టడికి పలువురు యోధులు ఎంతగానో శ్రమిస్తున్నారు. అలాంటి వారు హైకోర్టు వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దు. ప్రజాహితం కోసమే ఉత్తర్వులు ఇస్తున్నం. వీటిని అధికారులు ఒత్తిడిగా భావించొద్దు. కరోనా టెస్టులు, ట్రీట్మెంట్విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అత్యుత్తమ స్థానంలో ఉండాలన్నదే మా సంకల్పం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తోంది. 95 శాతం పర్‌ఫెక్షన్‌ వచ్చింది. మిగిలింది 5 శాతమే. ఇదే దిశగా అడుగులు వేస్తే కరోనా కట్టడి చేయవచ్చు’’ అని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ‌వ్యాఖ్యానించింది. సెప్టెంబర్‌ 4కు విచారణను వాయిదా వేసింది.