బర్త్ డే బాయ్ విజయ్.. ఖుషీతో హిట్ కొడతాడా?

బర్త్ డే బాయ్ విజయ్.. ఖుషీతో హిట్ కొడతాడా?

చేసినవి కొన్ని సినిమాలే ఐనా యూత్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. హిట్ ఫ్లాప్ తో సంబందంలేకుండా మనోడి క్రేజ్ రోజురోజుకీ పీక్స్ కి చేరుకుంటోంది. విజయ్ నటించిన లైగర్ భారీ ఫ్లాప్ గా నిలిచినా.. నార్త్ లో  స్ట్రాంగ్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమా గనుక హిట్ అయ్యి ఉంటే విజయ్ రేంజ్ నెక్స్ట్ లెవల్లో ఉండేది. కానీ ఏం చేస్తాం మనోడి బ్యాడ్ టైమే.

అందుకే విజయ్ తన తరువాత సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం  విజయ్ శివనిర్వాణతో ఖుషీ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపైనే విజయ్ ఆశలు పెట్టుకున్నారు. ఖుషీతో పాటు మరో 2 ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాడు.

అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి సినిమాతో పాటు పరశురామ్ డైరెక్షన్లో మరో ఇంట్రస్టింగ్ మూవీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. కెరీర్లో చాలాకాలం తరువాత సూపర్ లైనప్ సెట్ చేసుకున్నాడు విజయ్. అందుకే.. ఈ సినిమాలు విజయ్ ఖచ్చితంగా విజయాన్ని అందిస్తాయని ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మే 9 విజయ్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు విషెస్ తెలుపుతూ మెసేజెస్ చేస్తున్నారు ఫ్యాన్స్ అండ్ సెలబ్రెటీస్.