వేరియంట్‌‌ను గుర్తించిన పాపానికి మమ్మల్నే శిక్షిస్తరా?

వేరియంట్‌‌ను గుర్తించిన పాపానికి మమ్మల్నే శిక్షిస్తరా?

డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించిన పాపానికి తమనే ప్రపంచ దేశాలు శిక్షిస్తున్నాయని సౌత్ ఆఫ్రికా ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘దక్షిణాఫ్రికాలో వైరస్​ల మీద రీసెర్చ్ చేసిన అద్భుతమైన సైంటిఫిక్ సామర్థ్యాన్ని మెచ్చుకోవాలి గానీ, కక్షగట్టినట్టు ప్రవర్తించొద్దు. ఎక్కడో పుట్టిన కరోనాతో మా దేశం ఇప్పటికే 90 వేల మంది ప్రజల్ని కోల్పోయింది. వైరస్ ను కట్టడి చేసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. ప్రపంచ దేశాలు కూడా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా ముందుకు రావాలి” అని సౌతాఫ్రికా ఫారిన్ ఎఫైర్స్ మినిస్ట్రీ ఒక ప్రకటనలో కోరింది. తమను ప్రపంచ దేశాలన్నీ వెలివేసినట్లుగా ఆంక్షలు పెట్టడం సరికాదని పేర్కొంది.