
సికింద్రాబాద్, వెలుగు: ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యట్రిక్ సాధిస్తుందని, సికింద్రాబాద్ లో తాను హ్యాట్రిక్ కొట్టబోతున్నానని ఆ పార్టీ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం సీతాఫల్ మండిలో కార్పొరేటర్ హేమతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ సెగ్మెంట్లో భారీ మెజార్టీ గెలవబోతున్నామని చెప్పడానికి కార్యకర్తల ఆత్మ విశ్వాసమే నిదర్శనమన్నారు. ఆయన వెంట కార్పొరేటర్లు కంది శైలజ, రాసురి సునీత ఉన్నారు.
మేడిబావి, ఇందిరానగర్ కాలనీ, బీదల బస్తీ, శ్రీనివాస్ నగర్, సీతారాంనగర్ ప్రాంతాల్లోనూ పద్మారావు గౌడ్ ప్రచారం నిర్వహించారు. సెగ్మెంట్లోని వివిధ కుల సంఘాలు, స్థానిక సంస్థలు ఆయనకు మద్దతు తెలిపాయి. బుధవారం రాత్రి బౌద్దనగర్ గంగపుత్ర సంఘం సమావేశం వారాసిగూడలో జరిగింది. ఈ సమావేశంలో పద్మారావు గౌడ్‌కు అనుకూలంగా తీర్మానం చేశారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. గ్రేటర్ హైదరాబాద్ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పుల్లోజి అశోక్ చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాళ్ల బండి విష్ణుచారిల నేతృత్వంలో సంఘం ప్రతినిధుల బృందం పద్మారావు గౌడ్‌ను కలిసి మద్దతు తెలిపారు. గ్రేటర్ మాల కులస్తుల జేఏసీ చైర్మన్ ఉత్తమ్ సుమన్ పద్మారావు గౌడ్‌ను కలిసి మద్దతును ప్రకటించారు.