ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తా: శరద్ పవార్

ప్రతిపక్షాలను ఏకతాటిపైకి  తెచ్చేందుకు కృషి చేస్తా: శరద్ పవార్

పుణె: ప్రధాని రేసులో తాను లేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అన్నారు. దేశ అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. ఇటీవల మరణించి న పుణె యూనివర్సిటీ వీసీ రామ్ తకవాలే సంతాప సభలో పవార్ ​పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు అన్నీ కలిసి వస్తే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించడం పెద్ద పనేం కాదన్నారు. తాను ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకే ప్రయత్నాలు చేస్తున్నానని, వచ్చే లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పవార్ చెప్పారు.

మహా వికాస్ అఘాడిలో భాగమైన కాంగ్రెస్, శివసేన(యూబీటీ)తో సీట్ల పంపకంపై మాట్లాడుతూ.. ఇటీవల తన నివాసంలో సమావేశం జరిగింద ని, ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ లేదా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, తాను కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటా మని అన్నారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల పదవీకాలం 2022లో ముగిసింది. కరోనా కారణంగా ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. త్వరలోనే లోక్‌‌‌‌సభ ఎలక్షన్స్​, వచ్చే ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలూ జరగనున్నాయి.