రిటైర్మెంట్ ప్రకటించిన ఐర్లాండ్ మాజీ కెప్టెన్

రిటైర్మెంట్ ప్రకటించిన ఐర్లాండ్ మాజీ కెప్టెన్

ఐర్లాండ్ మాజీ కెప్టెన్ విలియం పోర్టర్‌ఫీల్డ్ గురువారం (జూన్ 16) న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.  37 ఏళ్ల పోర్టర్‌ఫీల్డ్  ఐర్లాండ్ తరుపున 148 వన్డేలు, 61 టీ20లు, 3 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.  ఇందులో 11 సెంచరీలు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 5000కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 2007లో పాక్ పైన గెలుపు, 2009టీ 20 వరల్డ్ కప్ కు క్వాలిఫై, 2011 వరల్డ్ కప్ లో ఇంగ్లడ్ పై గెలుపులో పోర్టర్‌ఫీల్డ్  పాత్ర కీలకమని చెప్పాలి. ఐర్లండ్‌కు తొలి కెప్టెన్‌గా వ్యవహరించిన ఘనత కూడా  పోర్టర్‌ఫీల్డ్‌ కి సొంతం. ఐర్లాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లలో రెండోస్థానంలో నిలిచిన పోర్టర్‌ఫీల్డ్ తన చివరి మ్యాచ్ లో మాత్రం డకౌట్ అయ్యాడు.  ఆటగాడిగా రిటైర్మెంట్ పోర్టర్‌ఫీల్డ్‌ ఇక నుంచి కోచ్‌ పాత్రలో మెరవనున్నాడు.