ముడి చమురుపై విండ్‌‌ఫాల్ పన్ను తగ్గింపు

ముడి చమురుపై విండ్‌‌ఫాల్ పన్ను తగ్గింపు

 న్యూఢిల్లీ :  దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్‌‌ఫాల్ పన్నును ప్రభుత్వం మంగళవారం నుంచి టన్నుకు రూ.2,300 నుంచి రూ.1,700కి తగ్గించింది. ఈ పన్నును ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ  రూపంలో విధిస్తారు.  డీజిల్, పెట్రోల్,  జెట్ ఇంధనాల ఎగుమతిపై ఈ సుంకం ఉండదు. కొత్త రేట్లు జనవరి 16 నుంచి అమలులోకి రానున్నాయి. మనదేశం మొదటగా జులై 1, 2022న విండ్‌‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌‌లను విధించింది.