Wipro layoffs : ఫ్రెషర్లను తొలగించిన విప్రో

Wipro layoffs : ఫ్రెషర్లను తొలగించిన విప్రో

ఐటీ దిగ్గజం విప్రో కూడా ఉద్యోగులను తొలగించే పనిలో పడింది. పని తీరు సరిగాలేని 452 మంది ఫ్రెషర్లను ఇంటికి సాగనంపింది. ట్రైనింగ్ పూర్తైన తర్వాత పని తీరును సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. తాజాగా కంపెనీ నిర్వహించిన టెస్టుల్లో ట్రైనీలు ఫెయిల్ అయ్యారు. దీంతో 452 మంది ఫ్రెషర్లను తొలగించాల్సి వచ్చిందని విప్రో వెల్లడించింది. అయితే ఫ్రెషర్ల ట్రైనింగ్ కోసం ఒక్కొక్కరిపై ఖర్చు చేసిన రూ.75వేలను తిరిగి చెల్లించాలని వార్తలు వచ్చాయి. అయితే వాటిని విప్రో ఖండించింది. ఆ వార్తల్లో నిజం లేదని తెలిపింది. గతంలో విప్రో మూన్‌ లైటింగ్‌కు పాల్పడిన 300 మంది ఉద్యోగుల్ని తొలగించింది.