విప్రో సీఎఫ్వో జతిన్ దలాల్ రాజీనామా

విప్రో సీఎఫ్వో జతిన్ దలాల్ రాజీనామా

విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ కంపెనీకి రాజీనామా చేసినట్లు ఐటీ దిగ్గజం తెలిపింది.21 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న దలాల్ 2015 నుంచి విప్రో సీఎఫ్ వోగా ఉన్నారు. నవంబర్ 30న ఆయన బాధ్యతలనుంచి తప్పుకోనున్నారు. కొత్త సీఎఫ్ వో గా అపర్ణ అయ్యర్ బాధ్యతలు స్వీకరించునున్నారు. ఆమె ప్రస్తుతం విప్రో ఫుల్ స్ట్రైడ్ క్లౌడ్ గ్లోబల్ బిజినెస్ లన్ సీఎఫ్ వో గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

రెండు దశాబ్దాలుగా విప్రో నాకు అనేక అవకాశాలను ఇచ్చింది. సంస్థ వెలుపల తన వృత్తిపరమైన లక్ష్యాలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు దలాల్ తన రాజీనామాలో తెలిపారు. అయితే 2023లో విప్రోకు చెందిన ప్రముఖ ఉద్యోగులు సంస్థ నుంచి నిష్క్రమించారు. ఇప్పటివరకు చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ సంజీవ్ సింగ్, అమెరికాస్ 2 సీఎఫ్ వో నితిన్,  ఇండియా హెడ్ సత్య ఈశ్వరన్, iDEAS బిజినెస్ హెడ్ రాజన్ కోహ్లీ, వైస్ ప్రెసిడెంట్ గుర్విందర్ సాహ్ని, అమెరికాస్ 1 CFO కామినీ షా, హెల్త్‌కేర్ హెడ్ రాజీనామా చేశారు. 

దలాల్ లాగానే రాబోయే CFO అయ్యర్ కూడా IT కంపెనీలో రెండు దశాబ్దాలుగా ఉన్నారు. ఆమె ఇంటర్నల్ ఆడిట్, బిజినెస్ ఫైనాన్స్, ఫైనాన్స్ ప్లానింగ్ అండ్ అనాలిసిస్, కార్పొరేట్ ట్రెజరీ, ఇన్వెస్టర్ రిలేషన్స్‌తో సహా సంస్థలో వివిధ ఫైనాన్స్ లలో బాధ్యతలు నిర్వహించారు.