వ్యాక్సిన్​ స్టాక్​ పెరుగుతంది.. మళ్లీ ఎగుమతి చేస్తం!

వ్యాక్సిన్​ స్టాక్​ పెరుగుతంది.. మళ్లీ ఎగుమతి చేస్తం!
  • రాష్ట్రాల దగ్గర 22 కోట్ల డోసులు 
  • నెలాఖరులోగా మరో 30 కోట్లు ఉత్పత్తి

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, యూటీల వద్ద ఇప్పటివరకు 20 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ స్టాక్ ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరో 31 కోట్ల డోసులు ఈ నెలాఖరులోగా సప్లయ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. దీంతో దేశంలో 100 శాతం వ్యాక్సినేషన్​కి సరిపడా పోను డిసెంబర్ నాటి 30 కోట్ల డోసులు అదనంగా మిగిలి ఉంటాయని చెప్పింది. దీంతో మిగిలిన వ్యాక్సిన్లను ప్రభుత్వం విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. గురువారం వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 22.45 కోట్ల డోసుల కంటే ఎక్కువ వ్యాక్సిన్ నిల్వలు ఉపయోగించకుండా ఉన్నాయన్నారు. “ఈ నెలలోనే మరో 31 కోట్ల  డోసులు పంపించేందుకు కేంద్రం రెడీగా ఉంది. దేశమంతటా 20 నుంచి 22 కోట్ల డోసుల కంటే ఎక్కువ వాడే అవసరం ఉండదు. అధికారిక అంచనాల ప్రకారం డిసెంబర్ నాటికి దేశంలో 30 కోట్ల కంటే ఎక్కువ డోసుల వ్యాక్సిన్ నిల్వలు మిగిలి ఉంటాయి. వాటిని కమర్షియల్​గా ఇతర దేశాలకు ఎక్స్ పోర్టు చేయడమే మంచిది”అని ఆయన చెప్పారు.

ఆస్ట్రియాలో మళ్లీ లాక్​డౌన్

కరోనా కంట్రోల్ కాకపోవడంతో దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధిస్తున్న ట్లు ఆస్ట్రియా ప్రకటించింది. సోమవారం నుంచి 10 రోజుల పాటు దేశమంతటా పూర్తి లాక్​డౌన్ అమల్లో ఉంటుందని ఆస్ట్రియా చాన్సలర్ అలెగ్జాండర్ తెలిపారు. ఈనెల 21 నుంచి ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే పర్మిషన్ ఇస్తామన్నా రు. ఆ తర్వాత కేసులు తగ్గకుంటే 
లాక్​డౌన్ పొడిగిస్తామని చెప్పారు.