50 సంగీత వాయిద్యాల​తో.. ‘మంగళ ధ్వని’

50 సంగీత వాయిద్యాల​తో.. ‘మంగళ ధ్వని’

 అయోధ్య : శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు కొనసాగుతున్నంత సేపు ఆలయం మొత్తం సంప్రదాయ సంగీతంతో మారుమోగింది. దేశవ్యాప్తంగా ఉన్న యాభై ట్రెడీషనల్ మ్యూజికల్ ఇన్​స్ట్రుమెంట్లతో ‘మంగళ ధ్వని’ ప్రోగ్రామ్ నిర్వహించారు. అయోధ్యకు చెందిన ప్రముఖ కవి యతీంద్ర మిశ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంగీత ప్రదర్శనకు.. ఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ మద్దతుగా నిలిచింది. మ్యూజికల్ ఇన్​స్ట్రుమెంట్లలో యూపీ నుంచి పఖ్వాజ్, ఫ్లూట్, ఢోలక్, కర్నాటక నుంచి వీణ, పంజాబ్ నుంచి అల్గోజ, మహారాష్ట్ర నుంచి సుందరి, ఒడిశా నుంచి మరదలా, మధ్యప్రదేశ్ నుంచి సంతూర్, మణిపూర్ నుంచి పంగ్, అస్సాం నుంచి నగడా, కలి, చత్తీస్​గఢ్ నుంచి తంబురా తీసుకొచ్చారు.

 అదేవిధంగా, ఢిల్లీ నుంచి షెహనాయి, రాజస్థాన్ నుంచి రవహనతా, వెస్ట్ బెంగాల్ నుంచి శ్రీఖోల్, సరూద్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, జార్ఖండ్ నుంచి సితార్, గుజరాత్ నుంచి సంతర్, బీహార్ నుంచి పఖ్వాజ్, ఉత్తరాఖండ్ నుంచి హుడ్కా, తమిళనాడు నుంచి నాగస్వరం, తవిల్, మృదంగం తీసుకొచ్చారు. ‘మంగళధ్వని’ ప్రదర్శనకు ముందు.. సింగర్స్ సోను నిగమ్, అనురాధ పౌడ్వాల్, కవిత పౌడ్వాల్, శంకర్ మహాదేవన్​తో పాటు మొత్తం 30 మంది ఆర్టిస్టులు అయోధ్య ఆవరణలో భక్తి గీతాలు పాడారు. ‘రామ్ ఆయేంగే..’ ‘అవధ్ మే రామ్ ఆయే హై’ అంటూ కాషాయ జెండాలు పట్టుకుని పాటలు పాడారు.