ఇథనాల్​తో రైతులు అన్నదాతలే కాదు.. ఇంధన దాతలు కూడా : గడ్కరీ

ఇథనాల్​తో రైతులు అన్నదాతలే కాదు.. ఇంధన దాతలు కూడా : గడ్కరీ
  • ఇథనాల్​కు పెరుగుతున్న డిమాండ్​.. కేంద్ర మంత్రి గడ్కరీ

న్యూఢిల్లీ : పెట్రోల్​, డీజిల్​లలో ఇథనాల్​ కలపడం పెరుగుదలతో దేశంలోని ఎగ్రికల్చర్​ ఎకానమీ రూపురేఖలు మారనున్నాయని, ఇకపై రైతులు అన్నదాతలుగా మాత్రమే కాకుండా ఉర్జ దాతలు కూడా అవుతారని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ చెప్పారు. 20% కంటే ఎక్కువ ఇథనాల్​ బ్లెండ్స్​తో నడిచే  బీఎస్​6 (స్టేజ్​2) ఎలక్ట్రిఫైడ్​ ఫ్లెక్స్​ ఫ్యూయెల్​ బేస్డ్​ వెహికల్​ను మంగళవారం గడ్కరీ లాంఛ్ చేశారు. ఇలాంటి వెహికల్​ తేవడం ప్రపంచంలోనే మొదటిసారి. మాన్యుఫాక్చరింగ్​, సర్వీసెస్​ సెక్టార్లతో పోలిస్తే జీడీపీలో అగ్రికల్చర్​ సెక్టార్ వాటా చాలా తక్కువగా 12 శాతంగా నమోదవుతోందని చెబుతూ, మరోవైపు దేశంలోని 65% ప్రజలు జీవనం కోసం అగ్రికల్చర్​పైనే ఆధారపడుతున్నారని గడ్కరీ పేర్కొన్నారు. ఇథనాల్​ పరిశ్రమ దేశంలోని రైతులకు వరంగా మారనుందని చెప్పారు. ఇథనాల్​ డిమాండ్​ రాబోయే కాలంలో భారీగా పెరుగుతుందని, ఫలితంగా దేశపు అగ్రికల్చర్​ ఎకానమి తీరుతెన్నులూ మారిపోతాయని పేర్కొన్నారు. దీంతో ఇప్పటిదాకా అన్నదాతలుగా పేరొందిన రైతులు ఇక మీదట ఉర్జ (ఇంధన) దాతలు గాను అవుతారని వెల్లడించారు.

ఇథనాల్​తో జీడీపీలో  అగ్రికల్చర్​ వాటా పెరుగుతుంది

దేశంలో ఇథనాల్​ డిమాండ్​ పెరుగుదలతో జీడీపీలో వ్యవసాయ రంగ వాటా పెరుగుతుందనే ధీమాను రోడ్​ ట్రాన్స్​పోర్ట్​ అండ్​ హైవేస్​ మినిస్టర్​ నితిన్​ గడ్కరీ వ్యక్తం చేశారు. ఇథనాల్​ ఎకానమి ఒక రోజు రూ. 2 లక్షల కోట్లకు ఎదుగుతుందని, ఆ రోజు జీడీపీలో వ్యవసాయ రంగ వాటా 20 శాతానికి చేరుతుందని ఆయన అంచనా వేశారు. ఆల్టర్నేటివ్​ ఫ్యూయెల్స్​తో జెనరేటర్​ సెట్స్​, వెహికల్స్​, ఎయిర్​క్రాఫ్ట్​లపై నిర్వహించిన టెస్టులు సక్సెస్​ అయినట్లు మంత్రి వెల్లడించారు. ఇథనాల్​ కలిపిన పెట్రోల్​ సప్లయ్​ చేయాల్సిందిగా పొరుగు దేశం బంగ్లాదేశ్​ రిక్వెస్ట్​ చేస్తోందని చెప్పారు. దేశంలో పొల్యూషన్​ తగ్గేలా తగిన టెక్నాలజీ డెవలప్​ చేసినందుకు టొయోట కిర్లోస్కర్​ కంపెనీని మంత్రి అభినందించడంతోపాటు, కృతజ్ఞతలు కూడా తెలిపారు. వ్యవసాయ రంగంలో కొత్త ఉద్యోగాలు రావడానికి ఈ చొరవ సాయపడుతుందని అన్నారు. ఫ్లెక్స్​ ఇంజిన్స్​తో మరిన్ని మోడల్స్​ తేవల్సిందిగా మంత్రి కోరారు. నూరు శాతం ఇథనాల్​తోనే నడిచే  మోటార్​ సైకిళ్లు, ఈ–రిక్షాలు, ఆటో రిక్షాలు, కార్లు రావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు గడ్కరీ చెప్పారు. 

ఇనోవా హైక్రాస్​ మోడల్​లాంటిదే...

ఇనోవా హైక్రాస్​ మోడల్​ ఆధారంగా ఈ ఎలక్ట్రిఫైడ్​ ఫ్లెక్స్​ ఫ్యూయెల్​ వెహికల్​ను టొయోటాకిర్లోస్కర్​ డిజైన్​ చేసింది. దేశంలోని ఎమిషన్​ నిబంధనలకు అనుగుణంగా దీనిని డెవలప్​ చేశారు. 2014 దాకా దేశంలోని వెహికల్స్​లో 1.53 శాతం మాత్రమే ఇథనాల్​ కలిపేవారని, మార్చి 2023 నాటికి అది 8 రెట్లు పెరిగి 11.5 శాతానికి చేరిందని కేంద్ర పెట్రోలియం, నేచురల్​ గ్యాస్​ మినిస్టర్​ హర్​దీప్​ సింగ్​ పురి వెల్లడించారు. ఫలితంగా దిగుమతుల ఖర్చు ఆదా అవడంతోపాటు, కార్బన్​ ఎమిషన్లూ తగ్గాయని పేర్కొన్నారు. ఈ–20 బ్లెండింగ్​ కోసం పెట్టుకున్న టార్గెట్​ను ముందుకు జరిపామని, అందరు స్టేక్​హోల్డర్ల చొరవ వల్లే ఇది సాధ్యమవుతోందని వివరించారు. దేశంలో ఈ–20 ఫ్యూయెల్​ డిస్పెన్స్​  చేసే 2025 నాటికి 3,300 ఏర్పాటవుతాయని మంత్రి పేర్కొన్నారు.