
జీఎస్టీ రేట్ల తగ్గింపు మూవీ లవర్స్ కి కూడా ఖర్చు తగ్గించనుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ స్లాబ్ రేట్ల మార్పులతో సెప్టెంబర్ 22, 2025 నుంచి సినిమా టిక్కెట్ల రేట్లు కూడా ప్రయోజనం పొందనున్నారు. కొత్త జీఎస్టీ స్లాబ్‌ల ప్రకారం రూ.100లోపు సినిమా టిక్కెట్లపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది. అయితే రూ.100 కంటే ఎక్కువ విలువైన టిక్కెట్లపై మాత్రం గతంలో ఉన్న 18 శాతం జీఎస్టీ పన్ను రేటు కొనసాగుతుందని క్లారిఫై చేసింది ప్రభుత్వం.
జీఎస్టీ రేట్ల మార్పు సింగిల్-స్క్రీన్ థియేటర్లకు, చిన్న పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సినిమా చూస్తున్న వారికి ఎక్కువగా ప్రయోజనం కలిగిస్తుంది. అయితే పెద్ద మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ల ధరలు సాధారణంగా 150 నుంచి 400 రూపాయల వరకు ఉండటంతో అక్కడ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఎలాంటి రిలీఫ్ లేదు.
ALSO READ : ఇండియాలోనే అత్యధిక ధర..
జీఎస్టీ మార్పులతో చిన్న థియేటర్లకు ఎక్కువ అమ్మకాల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అలాగే చిన్న పట్టణాల్లో సినీ ప్రదర్శనలు పెరుగుతాయి. తక్కువ రేటుకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలు అందుబాటులో ఉండటం వాటిని మూతపడటం నుంచి కాపాడటానికి తోడ్పాటుగా నిలుస్తుందని పరిశ్రమ భావిస్తోంది. అలాగే బటర్, సాల్టెడ్ పాప్ కార్న్ పై 5 శాతం జీఎస్టీ ఉండగా.. కేరమిల్ పాప్ కార్న్ పై 18 శాతం జీఎస్టీని ప్రకటించింది ప్రభుత్వం.