
కారు నడపాలంటే స్టీరింగ్ పట్టాలి. గేర్లు మార్చాలి. యాగ్జిలరేటర్ , క్లచ్ , బ్రేకులపై కాళ్లుండాలి. ఇవన్నీ చేయాలంటే కాళ్లూ , చేతులు సరిగ్గా ఉండాలి. అలాంటిది విమానం నడపాలంటే ఇంకెంత జాగ్రత్త అవసరం. కానీ, పుట్టుకతోనే చేతుల్లేకపోయినా విమానం నడిపింది ఆ మహిళ. నడపడమే కాదు, ప్రభుత్వం నుంచి విమాన పైలట్ లైసెన్స్ పొందింది. ఆమె పేరు జెస్సికా కాక్ స్ . 36 ఏళ్లు. జన్యులోపాలతో ఆమెకు చేతులు అభివృద్ధి కాలేదు.అమెరికా లోని అరిజోనా రాష్ట్రం లో ఉన్న ఫీనిక్స్ ఆమె సొంతూరు. చేతుల్లేకపోయినా ఆమేం కుంగిపోలేదు. కాళ్లు న్నాయి కదా అన్న ఆశాభావంతో నే బతికింది. కాళ్లతో నే పియానో వాయించడం నేర్చుకుంది. ఆ కాళ్లతోనే కారు డ్రైవింగ్ నేర్చుకుంది. ఇప్పుడు సింగిల్ ఇంజన్ పైలట్ అయింది. ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందింది. ఆ ఒక్కటే కా దు, స్కూబా డైవర్ గా సర్టిఫికెట్ పొందింది. తైక్వాండోలో థర్డ్ డిగ్రీ బ్లాక్ బెల్ట్‌ను సొంతం చేసుకుంది.