
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్, ఇతర ఫిజికల్ రిటైల్ లొకేషన్లు కస్టమర్లకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించగలిగితేనే వాటి బిజినెస్‌లు బాగుంటాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఇండియా సూచించింది. సౌత్ ఏషియాలో రిటైలింగ్‌పై ఇది విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. కరోనా తగ్గడంతో భారతీయ రిటైల్ సెక్టార్, రిటైల్ వినోద ప్రదేశాలకు గిరాకీ పెరుగుతోంది. రిటైల్ రంగం ఈ ఏడాది జూన్ క్వార్టర్లో బలంగా పుంజుకుంది. లావాదేవీలు సీక్వెన్షియల్‌గా 100 శాతానికిపైగా పెరిగాయి. ఇదే ఏడాది మొదటి ఆరు నెలల్లో ఇది సంవత్సరానికి 160 శాతానికిపైగా గ్రోత్‌ని సాధించింది. ఆన్‌లైన్ షాపింగ్ బలంగా ఉన్నప్పటికీ, ఫిజికల్ రిటైలింగ్కూ గిరాకీ బాగుండటం పెరుగుదలకు కారణం. సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈఓ అంశుమన్ మాట్లాడుతూ సాధారణ రిటైల్‌మాల్స్, షాప్స్ భవిష్యత్తులో విజయవంతం కావాలంటే కస్టమర్లకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని, బిల్డింగ్స్ బాగుండాలని కామెంట్ చేశారు.