కరోనా అలర్ట్: రోగనిరోధక శక్తి పెరగడానికి పాటించాల్సినవి ఇవే..

కరోనా అలర్ట్: రోగనిరోధక శక్తి పెరగడానికి పాటించాల్సినవి ఇవే..

కరోనా వైరస్ మహమ్మారి కేసులు ప్రతి రోజూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో భయాందోళనలు పెరుగుతున్నాయి. ఈ భయంకర కరోనా వైరస్‌కు ఇంకా మందు కనుగొనలేదు. ఇప్పటివరకు భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు 492కు చేరాయి. ఈ వైరస్ వల్ల ఇప్పటివరకు 10 మంది చనిపోయారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు భారత ప్రజానీకం ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’పాటించారు. ఆ తర్వాత వైరస్‌ను ఎదుర్కోవడానికి పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ కూడా ప్రకటించాయి. ఈ వైరస్ వ్యాప్తి ఇలాగే ఉంటే మనం దీనని భరించడం చాలా కష్టం. అందుకే మనందరం బాధ్యతగా కొన్ని నియమాలు పాటిస్తే కరోనా రాకుండా అరికట్టవచ్చు.

మనందరం మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే దేనినయినా ఎదుర్కోవచ్చు. అందుకోసం మనం ఏం తినాలి, ఏం తినకూడదు అనే దానిపై దృష్టిపెట్టాలి. మంచి పోషకాహారం తిన్నట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా రాకుండా అడ్డుకోవచ్చు. కాబట్టి మనం తినే ఆహారంలో విటమిన్లు, పోషకాలు ఉండేలా చూసుకోవాలి.

ఆరోగ్యానికి ఆరు నియమాలు

రోగనిరోధక శక్తి పెంచడంలో విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రతిరోజు మెంతి నీరు తాగడానికి ప్రయత్నించాలి. విటమిన్ బి, విటమిన్ డి మరియు జింక్ లభించే విటమిన్ సిలు ఎక్కువగా తీసుకోవాలి.

చాలామంది పండ్లు, కూరగాయలు పచ్చివి తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పచ్చివి తినడం తగ్గిస్తే మంచిది. సలాడ్లు ఆరోగ్యానికి మంచివే కానీ.. ప్రస్తుతం కరోనా దృష్ట్యా వండిన వాటిని తినడమే మంచిది.

వంట చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఉడకబెట్టిన కూరగాయలతో చేసిన సూప్‌లను తాగడం మంచిది. అది వీలుకాకపోతే పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.

మనిషి జీవితంలో వ్యాయామం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మన రోజువారీ పనులలో వ్యాయామం కూడా ఒక భాగం కావాలి. వ్యాయామం చేయకపోతే మన రోగనిరోధక శక్తి ఎప్పటికీ పెరగదు. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడానికి ప్రయత్నించాలి. కనీసం 30 నిమిషాల పాటైనా వ్యాయామం చేయాలి. అందుకోసం యోగా, ధ్యానం లేదా ఇంటిపనులను ఎంచుకోవచ్చు.

మానవునికి నీరు ఎంత అవసరమో చెప్పక్కర్లేదు. ప్రతిరోజు మీరు ఎంత నీళ్లు తాగుతున్నారో చెక్ చేసుకోవాలి. నిమ్మకాయ లేదా గ్లూకోజ్ వంటి విటమిన్ సి సప్లిమెంట్లు కలిపిన నీటిని తాగాలి. అల్లం లేదా కొత్తిమీరను కలిపి నీటిని వేడి చేసి తాగినా ఉపయోగం ఉంటుంది. ఇలా తాగితే మీ శరీరంలోని మలినాలను తొలగించుకోవచ్చు. ఇలా చేస్తే మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఇక జంక్ ఫుడ్ విషయానికొస్తే దాన్ని పూర్తిగా వదిలేయడం చాలా మంచిది. జంక్ ఫుడ్ బదులు తాజా పండ్లు, పెరుగు వంటివి తీసుకోవడం మంచిది. మీకు అంతగా జంక్ ఫుడ్ తినాలనిపిస్తే బ్రెడ్ ముక్కకు వెన్న రాసుకొని తినడం మంచిది.

For More News..

‘ఓనర్లు ఇంటి అద్దె అడగొద్దు’

లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ కీలక సమావేశం

మలేషియా నుంచి చెన్నై చేరిన 113 మంది ఇండియన్లు

కరోనా కట్టడికి విరాళమిచ్చిన హీరో నితిన్

పరీక్షలు లేకుండా పైతరగతులకు పంపే యోచనలో ప్రభుత్వం

కరోనా దెబ్బకు మూతపడ్డ ప్రముఖ మొబైల్ ప్లాంట్

డీఎస్పీపై కేసు నమోదు.. ఫారెన్ నుంచి వచ్చిన కొడుకు విషయం దాచినందుకే..

కాలిఫోర్నియా బీచుల్లో జనం జల్సాలు