వెబ్ సైట్ లో చూస్తూ వంట తయారీ..ముఖం పచ్చడైంది

వెబ్ సైట్ లో చూస్తూ వంట తయారీ..ముఖం పచ్చడైంది

వెబ్ సైట్, పుస్తకాలల్లో చూస్తూ వంట చేస్తున్నారా జర జాగ్రత్త. చేసే పద్దతిని ఏ మాత్రం పొరపాటు చేసినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వెబ్ సైట్ లో వంట ట్రై చేస్తూ ఇంగ్లండ్ లోని  ఓ యువతి గాయాలపాలైంది. ఇంగ్లాండ్‌ లోని వర్సెస్టర్‌సైర్ నగరానికి చెందిన బెదానీ రాసర్ (22) అనే యువతి డెలీష్ అనే వెబ్‌ సైట్‌ లో వంట తయారీని చూస్తూ కోడి గుడ్లతో సరికొత్త వంటకం తయారీకి రెడీ అయ్యింది. ఆ పుస్తకంలో చెప్పినట్లు మైక్రోవేవ్ ఓవెన్‌ లో కోడి గుండ్లు పెట్టింది. అవి పేలకుండా ఉండాలంటే ఉప్పు పెట్టాలని ఆ పుస్తకంలో ఉంది. దీంతో ఆమె అలాగే చేసింది. ఆ గుడ్లు మైక్రోవేవ్ ఓవెన్‌ లో ఉన్నంత సేపు బాగానే ఉన్నాయి. వాటిని బయటకు తీసిన వెంటనే పేలిపోయాయి. దీంతో ఆమె ముఖంలో కుడివైపు భాగం కాలిపోయింది. ఆమె కన్ను వాపుతో మూసుకుపోయింది.

ఈ ఘటన చోటుచేసుకోగానే ఎమర్జన్సీ నెంబర్‌కు డయల్ చేసి సాయం కోరింది.డాక్టర్లు  ఆమె ఇంటికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. తర్వాత హస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్లు వెళ్లడం కొంచెం ఆలస్యమైనా ఆమె కంటి చూపు కోల్పోయేదని ఆస్పత్రివర్గాలు చెప్పాయి. గుడ్లు పేలి ముఖానికి అంటుకోగానే చర్మం ఊడిపోతున్నట్లు అనిపించిందని, భయంతో కేకలు పెట్టానని తెలిపింది. రాసర్ ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటోందని తెలిపారు డాక్టర్లు.