టూ మచ్ రారే : లక్ష కట్నం కోసం.. ఎలా తన్నారో చూడండీ..

టూ మచ్ రారే : లక్ష కట్నం కోసం.. ఎలా తన్నారో చూడండీ..

ఉత్తరప్రదేశ్ లో  దారుణ ఘటన చోటు చేసుకుంది.   ఘజియాబాద్‌లో అదనపు కట్నం లక్ష రూపాయిలు తీసుకురావాలని  ఓ వివాహితపై  అత్తింటి కుటుంబసభ్యులు  గొడ్డలితో దాడి చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు.  

సమాజంలో సాంఘిక దురాచారాలు మితిమీరుతున్నాయి. వివాహిత మహిళలపై అత్తింటి వేధింపులు జరుగుతున్నాయి.  కొన్ని ఘటనలు బయటకు రాకుండా సమసిపోతుండగా మరికొన్ని ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.  ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో  అదనంగా లక్ష కట్నం తీసుకురావాలని భర్త .. భార్యపై గొడ్డలితో దాడి చేసిన వీడియో వైరల్ అయింది.  

కట్నం కోసం గొడ్డలితో దాడి

చాలా కాలంగా ఓ కుటుంబంలో కోడలను అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు.  ఇక ఆమె తన పుట్టింటి నుంచి ఏమీ తీసుకురాదని భావించిన అత్త, మామ, భర్త  వాళ్ల శాడిజాన్ని ప్రదర్శించారు. ఇంట్లో ఉన్న వివాహితను బయటకు లాక్కొచ్చి గొడ్డలితో దాడి చేశారు.  ఈ ఘటనను ఇరుగు పొరుగు వారు చూస్తున్న ఏమీ పట్టించుకో లేదు.  అయితే గుర్తు తెలియని వ్యక్తి ఒకరు వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.   బాధిత మహిళపై ఆమె అత్త, మామలు చేసిన భయంకరమైన అకృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  

సుమోటోగా కేసు నమోదు.. 

 బాధిత  మహిళను ఆమె అత్తమామలు బలవంతంగా  ఇంటి నుండి బయటకు లాగి, పదేపదే గొడ్డలితో దాడి చేశారు. , నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలికి సాయం  చేయడానికి వీలు లేకుండా  పట్టపగలు దాడి జరిగింది.  ఈ దాడిలో ఆమె తీవ్రగాయాలతో  నొప్పితో అరిచింది.  ఈ  ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు సుమోటోగా చర్యలు తీసుకున్నారు.  కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు బాధిత  మహిళ మామగారిని అదుపులోకి తీసుకున్నట్టు మోడినగర్‌లోని అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP) తెలిపారు. ఈ  దాడిలో పాల్గొన్న ఇతర వ్యక్తులందరినీ పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఏసీపీ తెలిపారు. బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

https://twitter.com/azizkavish/status/1664514686304550912