
జన్నారం, వెలుగు: తమ వాటా భూమిని ఇవ్వడం లేదని.. పంట సాగు చేద్దామంటే నారును పనికి రాకుండా చేస్తున్నాడంటూ ఓ మహిళ తన బావ, జైపూర్ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ముజీబొద్దీన్ పై ఆరోపణలు చేసింది. శుక్రవారం పొలం వద్దే హెయిర్కలర్తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలియగానే పోలీసులతోపాటు ఆర్ఐ గంగరాజు 108 వాహనంలో సంఘటన స్థలానికి చేరుకొని, బాధితురాలిని జన్నారం గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.
తన భర్త మహ్మమద్ పైహిమొద్దీన్ వికలాంగుడని, తమ వాటాగా రావాల్సిన 1.30 ఎకరాల భూమిని బావ(భర్త సోదరుడు) ముజీబొద్దీన్ ఇవ్వడం లేదని బాధితురాలు సీమ ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత మందికి చెప్పినా న్యాయం జరగడం లేదని వాపోయింది. అనంతరం ఆమెను మెరుగైన వైద్యం కోసం లక్సెట్టిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు.