
తాగుడికి బానిసై… మద్యం కొనుక్కునేందుకు డబ్బులివ్వలేదని కట్టుకున్న భార్యనే చంపాశాడో ఓ వ్యక్తి. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా లోని శంషాబాద్ లో జరిగింది. సంజయ్ వాడ కాలనీ కి చెందిన అలివేల్ అనే వ్యక్తి మద్యం తాగడానికి గాను డబ్బులు ఇవ్వాలని భార్య నర్సమ్మ ను అడిగాడు. అయితే ఆమె డబ్బులు ఇవ్వక పోవడంతో ఆగ్రహానికి లోనై… భార్య తలపై కర్రతో కొట్టి దారుణం గా హత్య చేశాడు. ఆ తర్వాత భయపడి శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు లొంగి పోయాడు. జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.