మేకప్తో మోసం.. 54 ఏళ్ల  వయసులో మూడో పెళ్లి

మేకప్తో మోసం.. 54 ఏళ్ల  వయసులో మూడో పెళ్లి

ఏపీలోని తిరుపతి జిల్లా పుత్తూరుకు చెందిన ఓ మహిళ మేకప్ తో మోసాలకు పాల్పడుతోంది. 54 ఏళ్ల వయసులో 30 ఏళ్ల మహిళలా మేకప్ వేసుకొని మూడో పెళ్లి చేసుకుంది. చివరికి ఆధార్ కార్డుతో దొరికిపోయింది. దీంతో మూడో భర్త పోలీసులను ఆశ్రయించగా దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పుత్తూరుకు చెందిన శరణ్యకు రవి అనే వ్యక్తితో గతంలోనే పెళ్లి అయింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు.

అయితే భర్తతో గొడవలు అవడంతో విడిగా ఉంటున్నారు. దీంతో శరణ్య  సుకన్యగా పేరు మార్చుకొని తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణంను పెళ్లి చేసుకుంది. 11 ఏళ్లు కాపురం చేశాక అతని నుంచి కూడా విడిపోయిందని పోలీసులు  తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో మరో పెళ్లి చేసుకోడానికి సిద్ధమైంది శరణ్య. బ్యూటీ పార్లర్ కి వెళ్లి మేకప్ వేసుకొని ఫోటోలను మ్యారేజ్ వెబ్ సైట్లలో పెట్టింది.

సంధ్య గా పేరు మార్చుకొని తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పుదుపేటకు చెందిన గణేశ్ ను 2021లో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన తర్వాత అత్త, భర్తపై ఉన్న ఆస్తులన్ని తన పేరున పెట్టాలంటూ భర్తను టార్చర్ చేసిందని పోలీసులు తెలిపారు. దీంతో భర్త ఆధార్ కార్డ్ అడగ్గా అసలు విషయాలు బయటపడ్డాయన్నారు. ఆధార్ కార్డులో భర్త పేరు రవి అని ఉండటంతో గణేష్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో శరణ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.