ల్యాంకో హిల్స్ లోని 15వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య

ల్యాంకో హిల్స్ లోని 15వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్ మణికొండలో దారుణం జరిగింది.  లాక్ డౌన్  కారణంగా ఇంటికి వెళ్లలేక మనస్తాపానికి గురైన ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలోని కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన ఈర వల్లిక అనే 20ఏళ్ల యువతి గత రెండు నెలలుగా ల్యాంకో హిల్స్‌లోని ఓ ఇంటిలో పని చేస్తోంది. లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికి వెళ్లలేకపోయింది. ఈ క్రమంలో వారం క్రితం ఆమె అక్క ఓ పాపకు జన్మనిచ్చింది. ఈరవల్లిక తన తల్లికి ఫోన్‌ చేసి పాపను చూడటానికి వస్తానని చెప్పింది. లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో వచ్చేందుకు కుదరదని అక్కడే ఉండాలని తల్లి చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ల్యాంకో హిల్స్ అపార్ట్ మెంట్ లోని భవనం 15వ అంతస్తు ఆమె దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.