జీడిమెట్ల, వెలుగు: కొడుకు బర్త్ డేకు భర్త గోల్డ్ చైన్ చేయించలేదని మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన నాగ సత్యవేణి(26)కి 2017లో సూరన్న నరసింహారెడ్డి(30)తో పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. రెండో కొడుకు జ్ఞానేశ్వర్ బర్త్ డే వారం రోజుల కిందట జరిగింది. అయితే, బర్త్ డే సందర్భంగా జ్ఞానేశ్వర్‌కు గోల్డ్ చైన్ చేయించాలని నాగ సత్యవేణి భర్తను అడిగింది. ఆర్థిక పరిస్థితి బాగా లేదని.. తర్వాత చేయిస్తానని నరసింహారెడ్డి భార్యకు నచ్చజెప్పాడు.
వారం రోజుల కిందట జ్ఞానేశ్వర్ బర్త్ డే జరిగింది. గోల్డ్ చైన్ లేకుండానే బర్త్ డే చేసినందుకు నాగ సత్యవేణి భర్తతో గొడవ పడింది. ఈ విషయంలో వారం రోజులుగా వీరిద్దరి మధ్య గొడవ జరుగుతోంది. మనస్తాపానికి గురైన నాగ సత్యవేణి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో సూసైడ్ చేసుకుంది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.