వడ్డీ వ్యాపారి వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం

వడ్డీ వ్యాపారి వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం

కాశిబుగ్గ, వెలుగు: వడ్డీ వ్యాపారి వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈఘటన సోమవారం వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. మిల్స్ కాలనీ పోలీసులు, బాధితురాలు రజిత చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని శివనగర్ కు చెందిన రజిత ఇండ్లలో పని చేసుకుంటూ జీవిస్తోంది. అదే ఏరియాకు చెందిన మంజుల అనే వడ్డీవ్యాపారి దగ్గర రజిత రూ.50వేలు అప్పుగా తీసుకుంది. 20 నెలలుగా 10 శాతం వడ్డీ కట్టింది . ‘‘కరోనా టైమ్లో డబ్బులు రావడంలేదు,. కొంత సమయం కావాలి”అని రజిత వడ్డీ వ్యాపారి మంజులను కోరినా వినలేదు. కట్టాల్సిందే అంటూ రజితను వేధించింది. ఈక్రమంలో రజితపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో మంజుల కేసు పెట్టింది.

ఇద్దరిని స్టేషన్ కు పిలిపించి 10 శాతం వడ్డీ ఎలా తీసుకుంటావ్ అని మంజులను హెచ్చరించి బయటికి పంపించారు. దీంతో వడ్డీ వ్యాపారి మంజుల స్థానిక పెద్ద మనుషుల వద్దకు పంచాయితీ పెట్టించింది. డబ్బులు కట్టాల్సిందే అంటూ అక్కడున్న వారు చెప్పడంతో.. వడ్డీ వ్యాపారి మంజుల వేధింపులు భరించలేక రజిత ఇద్దరు చిన్నారులతో రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లింది. ఆమెను చూసిన రైల్వే పోలీసులు, సిబ్బంది అడ్డుకొని మిల్స్ కాలనీ స్టేషన్ కు తీసుకువచ్చి అప్పగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం