ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో మహిళ మృతి.. ములుగు జిల్లా నార్లాపూర్ లో ఘటన

ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో మహిళ మృతి.. ములుగు జిల్లా నార్లాపూర్ లో ఘటన

తాడ్వాయి, వెలుగు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు శంకరమ్మ(55) బంధువుల ఇంటికి వెళ్లేందుకు సోమవారం మధ్యాహ్నం గ్రామ బస్టాప్ వద్ద ఆగిన బస్సును  పరిగెత్తుకుంటూ వెళ్లి ఎక్కింది. 

ఆధార్ కార్డు కండక్టర్ కు చూపించి టికెట్ తీసుకుంది. అనంతరం రెండు నిమిషాల వ్యవధిలోనే ఆమె సృహ తప్పి పడిపోయింది. వెంటనే తోటి ప్రయాణికులు చూసి డ్రైవర్ కు చెప్పగా బస్సును ఆపారు. కండక్టర్ ఆమె వద్దకు వెళ్లి చూసేసరికి అప్పటికే శంకరమ్మ చనిపోయింది. ఫోన్ చేసి ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు.  గ్రామస్తులు డెడ్ బాడీని కిందకు దించి ఇంటికి తీసుకెళ్లారు. శంకరమ్మకు ఇద్దరు కొడుకులు. కాగా.. వారు ఉపాధి కోసం వెళ్లి హైదరాబాద్ లో ఉంటున్నారు.