లెవిస్ జీన్స్‌‌ని ఆర్డర్ పెడ్తే.. ఉల్లిగడ్డలు వచ్చినయ్

లెవిస్ జీన్స్‌‌ని ఆర్డర్ పెడ్తే.. ఉల్లిగడ్డలు వచ్చినయ్

అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ వంటి ఆన్​లైన్​ సైట్లలో ఏదైనా వస్తువు ఆర్డర్​ పెట్టినప్పుడు దానికి బదులుగా మరొకటి రావడం, బాక్స్​లో రాళ్లు, ఇటుకలు ఉండడం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే.. అవి కొత్త వస్తువులు కాబట్టి, ట్రాన్స్​పోర్ట్ చేసేటప్పుడు ఎవరైనా దొంగిలించి ఉంటారు. కానీ.. ఇక్కడ సెకండ్​ హ్యాండ్​ ప్యాంట్​ కొంటే.. దాన్ని కూడా మాయం చేశారు. డెపాప్‌‌ అనే సెకండ్ హ్యాండ్ ఫ్యాషన్ సైట్ బ్రిటన్​లో సర్వీసులు అందిస్తుంది.

ఇందులో ఎవరైనా తమ సెకండ్​ హ్యాండ్​ బట్టలు, ఫ్యాషన్​ వేర్​ అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. అయితే.. ఈ సైట్​ నుంచి ఒకావిడ లెవిస్ జీన్స్‌‌ని ఆర్డర్ పెట్టింది. పార్శిల్​ వచ్చిన తర్వాత ఓపెన్​ చేసి చూస్తే.. అందులో ప్యాంట్​కు బదులు చిన్న ఉల్లిగడ్డలు ఉన్నాయి. వెంటనే ఆమె ఆ ప్యాంట్​ అమ్మిన సెల్లర్​కి మెసేజ్​ చేసింది. ‘‘నేను పంపింది జీన్స్​ అయితే.. మీకు ఉల్లిగడ్డలు ఎలా వచ్చాయ’’ని అతను కూడా ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్​లో షేర్​ చేసింది. ఈ పోస్ట్​ బాగా వైరల్ అవుతోంది.